త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Election Commission | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. బెంగాల్ సీఎస్‌, హోం సెక్ర‌ట‌రీపై ఈసీ వేటు..

Election Commission | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్ (Election Commission) అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. 294 సీట్లున్న శాస‌న స‌భ‌కు (Assembly Elections) ఏప్రిల్‌లో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి.

G

National | Published On Mar 16, 2026, 10.44 am IST

Election Commission | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. బెంగాల్ సీఎస్‌, హోం సెక్ర‌ట‌రీపై ఈసీ వేటు..
Advertisement

Election Commission | త్రినేత్ర‌.న్యూస్‌: ప‌శ్చిమ బెంగాల్ (Election Commission) అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు న‌గారా మోగింది. 294 సీట్లున్న శాస‌న స‌భ‌కు (Assembly Elections) ఏప్రిల్‌లో రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. కేంద్ర ఎన్నిక‌ల సంఘం (Election Commission) ఆదివారం షెడ్యూల్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బెంగాల్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, హోంశాఖ కార్య‌ద‌ర్శిపై వేటు వేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఎన్నిక‌లు పూర్త‌య్యే వర‌కు ఆ ఇద్ద‌రికి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వొద్ద‌ని స్ప‌ష్టం చేసింది. వారి స్థానంలో కొత్త చీఫ్ సెక్రటరీగా దుష్యంత్ నరియాల, హోం సెక్రటరీగా సంఘమిత్ర ఘోష్‌లను నియ‌మించింది.

తన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. విధుల్లో చేరిన అధికారుల‌ వివరాలతో కూడిన నివేదికను సోమవారం మధ్యాహ్నం 3 గంటల లోపు పంపాలని స్ప‌ష్టం చేసింది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నందిని చక్రవర్తి, హోం శాఖ ప్రిన్సిప‌ల్‌ సెక్రట‌రీగా జ‌గ‌దీశ్ ప్ర‌సాద్ మీనా ఉ‍న్నారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో పోలింగ్ జ‌రుగ‌నుంది. మొద‌టి విడ‌త‌లో 152 స్థానాల‌కు ఏప్రిల్ 23న‌, రెండో విడుత‌లో 142 సీట్ల‌కు ఏప్రిల్ 29న పోలింగ్ జ‌రుగుతుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, గ‌త 15 ఏండ్లుగా బెంగాల్‌లో అధికారంలో కొన‌సాగుతున్న సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ వ‌రుస‌గా నాలుగోసారి విజ‌యం కోసం శ్ర‌మిస్తున్నారు. రాష్ట్రంలో ఓట‌రు జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ త‌రువాత ఓట‌ర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.44 కోట్ల‌కు త‌గ్గింది. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ స్వ‌రూపం మారిపోయింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

మోగిన ఎన్నిక‌ల న‌గారా..!

ఆస్కార్ వేడుక‌లో ప్రియాంక చోప్రాకు త‌ప్పిన ప్ర‌మాదం - వీడియో వైర‌ల్‌

ఆస్కార్ అవార్డులు.. ఉత్త‌మ చిత్రం ఇదే..

నేను చ‌నిపోయా.. మ‌ర‌ణ వార్త‌ల‌పై ఆస‌క్తిక‌రంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్యాహు

 

Advertisement
Advertisement