త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి అన్నపూర్ణ స్కీమ్ కింద నెలకు రూ.3000, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించనుంది.

J

National | Published On May 18, 2026, 3.50 pm IST

West Bengal Annapurna Scheme | బెంగాల్ సర్కార్ భారీ నజరానా: మహిళలకు నెలకు రూ.3000, ఉచిత బస్సు ప్రయాణం!
Advertisement

West Bengal Annapurna Scheme | పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి (Suvendu Adhikari) నేతృత్వంలో సోమవారం జరిగిన క్యాబినెట్ (Cabinet) సమావేశంలో పలు కీలక పథకాలకు ఆమోదముద్ర వేశారు. ఇందులో ప్రధానంగా మహిళలకు నెలకు రూ.3,000 అందించే 'అన్నపూర్ణ స్కీమ్'తో పాటు, ప్రభుత్వ బస్సుల్లో ఫ్రీ ట్రావెల్ సదుపాయాన్ని జూన్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి అగ్నిమిత్ర పాల్ అధికారికంగా వెల్లడించారు.

అన్నపూర్ణ స్కీమ్, ఫ్రీ బస్సు ప్రయాణం

సీఎం సువేందు అధికారి క్యాబినెట్ సోమవారం పలు కీలక ప్రతిపాదనలను ఆమోదించింది. జూన్ 1, 2026 నుంచి బెంగాల్‌లోని మహిళలందరికీ 'అన్నపూర్ణ స్కీమ్' కింద ప్రతి నెలా రూ. 3,000 చొప్పున ఆర్థిక సాయం (Financial assistance) అందజేస్తామని మంత్రి పాల్ ప్రకటించారు. అదే రోజు నుంచి మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు.

ఉద్యోగులకు 7వ వేతన సంఘం

మహిళలకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, విద్యాసంస్థల సిబ్బంది కోసం ఏడో రాష్ట్ర వేతన సంఘం (7th Pay Commission) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇకపై మతపరమైన వర్గీకరణల ఆధారంగా ఇచ్చే ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని జూన్ నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే, CAA కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారు, ఓటరు జాబితా కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ సభ్యులు కూడా ఈ అన్నపూర్ణ స్కీమ్ ప్రయోజనాలు పొందేందుకు అర్హులని మంత్రి స్పష్టం చేశారు.

ఓబీసీ జాబితా రద్దు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

"కలకత్తా హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఓబీసీ (OBC) జాబితాను రద్దు చేశాం. కోటా అర్హతను నిర్ణయించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని (Inquiry panel) ఏర్పాటు చేస్తాం" అని పాల్ వెల్లడించారు. హైకోర్టు తీర్పుకు పూర్తి అనుగుణంగానే ఓబీసీ సంబంధిత విషయాల్లో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, పర్యావరణహితమైన కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric buses) సామాన్య ప్రజల కోసం ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. పరిపాలనను మరింత వేగవంతం చేయడానికి ఇకపై ప్రతి 15 రోజులకోసారి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement
Advertisement