Priyanka Chopra | ఆస్కార్ వేడుకలో ప్రియాంక చోప్రాకు తప్పిన ప్రమాదం – వీడియో వైరల్
ఆస్కార్ వేడుకలో ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్‌లకు ప్రమాదం తప్పింది. రెడ్ కార్పెట్ వద్ద చేరుకోవడానికి వారు ప్రయాణించిన గోల్ఫ్ కార్ట్ వేగం కారణంగా బోల్తా పడబోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.
Entertainment | Published On Mar 16, 2026, 10.21 am IST
Priyanka Chopra | 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డు వేడుకలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్‌తో పాటు సిన్నర్స్ సినిమాలు సత్తా చాటాయి. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఆరు, సిన్నర్స్ నాలుగు అవార్డులను సొంతం చేసుకున్నాయి. కాగా ఆస్కార్ వేడుకలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సందడి చేసింది. అవార్డ్ ప్రజెంటర్స్‌లో ఒకరిగా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విజేతలకు ప్రియాంక పురస్కారాన్ని అందజేసింది.
తప్పిన ప్రమాదం...
కాగా ఆస్కార్ వేడుకలో ప్రియాంక చోప్రాకు పెద్ద ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న గోల్ఫ్ కార్ట్ గాలిలోకి లేచింది. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రియాంక చోప్రాతో పాటు ఆమె భర్త నిక్ జోనస్ క్షేమంగా బయటపడ్డారు.
ఇరాన్, ఇజ్రాయెల్ వార్ కారణంగా ఈ సారి ఆస్కార్ వేడుకను కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించారు. రెడ్ కార్పెట్ వేదిక వద్దకు సెలిబ్రిటీల కార్లను అనుమతించలేదు. కారును పార్క్ చేసిన తర్వాత రెడ్ కార్పెట్ వద్దకు చేరుకోవడానికి గోల్ఫ్ కార్ట్‌లను ఏర్పాటుచేశారు. ప్రియాంక చోప్రా , నిక్ జోనస్ కోసం నిర్వహకులు ఓ గోల్ఫ్ కార్ట్ ఏర్పాటుచేశారు.
వీడియో వైరల్...
వేగం కారణంగా మలుపు తిరిగే సమయంలో ప్రియాంక, నిక్ జోనస్ ప్రయాణిస్తున్న గోల్ఫ్ కార్డ్ పక్కకు వంగిపోయింది. కార్ట్ టైర్ గాల్లోకి లేచింది. దాంతో ప్రియాంక, నిక్ జోనస్ షాకయ్యారు. కార్ట్ బోల్తా పడబోయింది. కానీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవరించడంతో ప్రమాదం తప్పింది. దాంతో నిక్, ప్రియాంక ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆస్కార్ ఏర్పాట్లపై నెటిజన్లు ఫైర్ అవుతోన్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని కామెంట్లు పెడుతున్నారు.
రెండోసారి....
ఆస్కార్ ప్రజెంటర్‌గా ప్రియాంక వ్యవహరించడం ఇది రెండో సారి. 2016 ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్నది. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో సందడి చేసింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా వారణాసి సినిమా చేస్తోంది. మహేష్‌బాబు హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది.
🚨 EXCLUSIVE: Nick Jonas and Priyanka Chopra nearly had a wipeout before even hitting the red carpet at the Oscars ... after their golf cart ride to the entrance got a little too wild. pic.twitter.com/nU4FSChlQH
— TMZ (@TMZ) March 15, 2026
సంబంధిత వార్తలు

Priyanka Chopra | పాకిస్థానీ దిగ్గజ నటి పాత్రలో ప్రియాంక చోప్రా.. ఫస్ట్ ఐటెమ్ గర్ల్‌గా గ్లోబల్ స్టార్
మే 14, 2026

Priyanka Chopra | దళపతి విజయ్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభవాలపై ప్రియాంక చోప్రా కామెంట్స్
మే 11, 2026

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా…
మే 7, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



