త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Mataram | ఇక మ‌ద‌ర్సాల్లోనూ వందేమాత‌రం త‌ప్ప‌నిస‌రి.. బెంగాల్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Vande Mataram | ప‌శ్చిమ బెంగాల్ (West Bengal)లోని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న అన్ని మ‌ద‌ర్సాల్లోనూ వందేమాత‌రం (Vande Mataram) ఆల‌పించ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

D

National | Published On May 21, 2026, 3.33 pm IST

Vande Mataram | ఇక మ‌ద‌ర్సాల్లోనూ వందేమాత‌రం త‌ప్ప‌నిస‌రి.. బెంగాల్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
Advertisement

Vande Mataram | ప‌శ్చిమ బెంగాల్ (West Bengal)లోని సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే అన్ని పాఠ‌శాల‌ల్లో ఉద‌యం ప్రార్థ‌న‌గా వందేమాతరాన్ని (Vande Mataram) ఆల‌పించ‌డం తప్పనిసరి చేసిన సువేందు సర్కార్.. ఇప్పుడు ఆ నిబంధనను మదర్సాలకు (Madarsahs) వ‌ర్తించేలా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ర‌కాల మ‌ద‌ర్సాల్లో త‌ప్ప‌నిస‌రిగా జాతీయ గేయాన్ని ఆల‌పించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నిబంధ‌న‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తెలిపింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాలు, మదర్సా విద్యా శాఖ పరిధిలోకి వచ్చే గుర్తింపు పొందిన, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స‌హా అన్ని మదర్సాల‌కు ఈ ఉత్తర్వులు వ‌ర్తిస్తాయ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.

కాగా, బెంగాల్‌లో బీజేపీ ప్ర‌భుత్వం కొలువు దీరిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ సువేందు అధికారి పాలనలో విప్లవాత్మక మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు. రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌ల్లో వందేమాత‌రం తప్ప‌నిస‌రి చేస్తూ ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఉద‌యం అసెంబ్లీలో త‌ర‌గ‌తులు ప్రారంభం కావ‌డానికి ముందే విద్యార్థులు ఈ జాతీయ గీతంలోని ఆరు చ‌ర‌ణాల‌ను ఆల‌పించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇప్పుడు అవే నిబంధ‌న‌లు మ‌ద‌ర్సాల‌కు కూడా వ‌ర్తిస్తాయ‌ని స్ప‌స్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల మదర్సాల్లో ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుంది.

Also Read..

కాక్రోచ్‌ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్‌

ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్‌.. రూ.17,600కే 7 జ్యోతిర్లింగాల ద‌ర్శ‌నం.. సికింద్రాబాద్ నుంచి టూర్ స్టార్ట్‌

క‌నీస వేత‌నాలున్న‌ప్పుడే కార్మికులు సంతోషంగా ప‌ని చేస్తారు: మంత్రి వివేక్‌

Advertisement
Advertisement