త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్ట‌ర్లు – మ‌మితా బైజు హీరోయిన్ – నిర్మాత‌గా కోలీవుడ్ స్టార్‌

ప్రేమ‌లు బ్యూటీ మ‌మితా బైజు ఫ‌స్ట్ టైమ్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఆరుగురు డైరెక్ట‌ర్లు క‌లిసి తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ నిర్మిస్తున్నాడు. ఆనేవాలా స్టార్ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను సోమ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు.

N

Entertainment | Published On Jul 6, 2026, 11.59 am IST

Mamitha Baiju | ఒకే సినిమాకు ఆరుగురు డైరెక్ట‌ర్లు – మ‌మితా బైజు హీరోయిన్ – నిర్మాత‌గా కోలీవుడ్ స్టార్‌
Advertisement

Mamitha Baiju | కోలీవుడ్ స్టార్ హీరో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ ప్రొడ్యూస‌ర్‌గా మారాడు. ఆనేవాలా స్టార్ పేరుతో ఓ యాక్ష‌న్ కామెడీ సినిమా చేస్తోన్నాడు. సోమ‌వారం ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. సాధార‌ణంగా ఓ సినిమా ఒక‌రే ద‌ర్శ‌కుడు ఉంటాడు. కొన్నిసార్లు ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు క‌లిసి సినిమాల‌ను తెర‌కెక్కించారు. కానీ ఆనేవాలా స్టార్ సినిమాను ఆరుగురు డైరెక్ట‌ర్లు క‌లిసి తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ వ‌ద్ద ప‌నిచేసిన అసిస్టెంట్లు ఆరుగురు ఈ సినిమాతో ద‌ర్శ‌కులుగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. అల్ఫా యూనిట్ పేరుతో సినిమాను రూపొందిస్తున్నారు.

యాక్ట‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్...

ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో కోలీవుడ్ డైరెక్ట‌ర్ అశ్వ‌త్ మారిముత్తు న‌టిస్తున్నాడు. యాక్ట‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ ఈ మూవీతోనే కెమెరా ముందుకు రాబోతున్నాడు. . డ్రాగ‌న్‌, ఓ మై క‌డావులే సినిమాల‌తో డైరెక్ట‌ర్‌గా పెద్ద విజ‌యాల‌ను అందుకున్నాడు అశ్వ‌త్ మారిముత్తు. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌తో ధ‌ర్మ‌న్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ్ అయ్యింది.

మ‌మితా బైజు హీరోయిన్‌....

ఆనేవాలా హీరోలో మ‌మితా బైజు హీరోయిన్‌గా క‌నిపించ‌బోతుంది. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో ఈ త‌మిళ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. అనౌన్స్‌మెంట్ వీడియోలో అశ్వ‌త్ మారిముత్తుపై క‌త్తి విసిరుతూ మ‌మితా బైజు స్టైలిష్ లుక్‌లో క‌నిపించింది. ఈ వీడియో చూస్తుంటే యాక్ష‌న్ రోల్‌లో ఈ ప్రేమ‌లు బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అనామికా మ‌హి, స్వాసిక కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

డ్యూడ్‌లో హీరోయిన్‌....

కంటెంట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌ను ప్రోత్స‌హించే ఉద్దేశంతో పీఆర్ షో పేరుతో బ్యాన‌ర్‌ను నెల‌కొల్పారు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌. ఈ బ్యాన‌ర్‌లో ఫ‌స్ట్ మూవీగా ఆనేవాలా స్టార్‌ను అనౌన్స్‌చేశారు. ఇందులో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ గెస్ట్‌గా క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ గ‌త మూవీ డ్యూడ్‌లో మ‌మితా బైజు హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పుడు ప్రొడ్యూస‌ర్‌గా అత‌డు చేస్తోన్న ఫ‌స్ట్ మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా న‌టించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
సాయి అభ్యంక‌ర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అనౌన్స్‌మెంట్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Advertisement
Advertisement