త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Airline Ticket Prices | ప్రయాణికులకు ఊరట.. విమాన ఛార్జీలపై కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Airline Ticket Prices | కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. విమాన ప్ర‌యాణికుల‌కు ఊర‌ట క‌ల్పిస్తూ విమాన ఛార్జీలపై (Airline Ticket Prices) సరికొత్త నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసింది (Centre Notifies New Rules). అత్య‌వ‌స‌ర‌, అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా విమాన టికెట్ల ధ‌ర‌ల్లో జోక్యం చేసుకునేలా ప్ర‌భుత్వానికి వెసులుబాటు క‌ల్పించింది.

D

National | Published On Nov 2, 2026, 1.00 pm IST

Airline Ticket Prices | ప్రయాణికులకు ఊరట.. విమాన ఛార్జీలపై కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం
Advertisement

Airline Ticket Prices | త్రినేత్ర న్యూస్ : ముడిచమురు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు (Airline Ticket Prices) పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే అడ్డ‌గోలుగా పెంచుతున్న టికెట్ ధ‌ర‌ల‌కు చెక్ పెట్టేలా కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల‌కు ఊర‌ట క‌ల్పిస్తూ విమాన ఛార్జీలపై సరికొత్త నిబంధనలను అధికారికంగా నోటిఫై చేసింది (Centre Notifies New Rules). ఈ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. అత్య‌వ‌స‌ర‌, అసాధార‌ణ ప‌రిస్థితుల్లో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల దృష్ట్యా విమాన టికెట్ల ధ‌ర‌ల్లో జోక్యం చేసుకునేలా ప్ర‌భుత్వానికి వెసులుబాటు ఉంటుంది.

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ భారతీయ వాయుయాన్ నియమ్, 2026 (Bharatiya Vayuyan Niyam, 2026) పేరుతో ఈ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అడ్డగోలుగా పెరిగే ఛార్జీలను నియంత్రించడానికి ఎయిర్‌లైన్స్ సంస్థలకు ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేయొచ్చు. అయితే, ఈ ఆదేశాలు ఆయా పరిస్థితులకు తగినట్లుగా ఉండాలని, నిర్దిష్ట కాలానికి మాత్రమే అమల్లో ఉంటాయని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

  • కొత్త నిబంధనల్లోని రూల్ 192 ప్రకారం.. షెడ్యూల్డ్ విమాన సేవలను నిర్వహిస్తున్న విమానయాన సంస్థలు తమ నిర్వహణ వ్యయంతో సహా పలు అంశాల ఆధారంగా ఛార్జీలను నిర్ణయించి ఆ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సమర్పించాల్సి ఉంటుంది.
  • అంతేకాదు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సూచించిన ఫార్మాట్ ప్రకారం విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో టికెట్ ధరలను తప్పనిసరిగా ప్రచురించాలి.
  • ప్ర‌యాణికులు బుకింగ్ స‌మ‌యంలో చెల్లించాల్సి మొత్తం స్ప‌ష్టంగా చూపించాలి. టికెట్‌పై కూడా ఆ ధ‌ర‌ల‌ను చూపించాలి.
  • బేస్ ఫేర్, ప‌న్నులు, ఫీజులు, ర‌ద్దు ఛార్జీలు, రీఫండ్ నిబంధ‌న‌లు, ఇత‌ర ఛార్జీల వివ‌రాల‌ను ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంచాలి. దీనివల్ల ప్రయాణికులకు పూర్తి పారదర్శకత లభిస్తుంది.
  • డీజీసీఏ వీటిని నిరంతరం పర్యవేక్షిస్తుంది.

భారతదేశంలో 1994లో విమాన టికెట్ ధరల నిర్ణయంపై ప్రభుత్వ నియంత్రణలను తొలగించారు. దీంతో డిమాండ్, నిర్వహణ ఖర్చులు, బుకింగ్ సమయం ఆధారంగా టికెట్ ధరలను నిర్ణయించుకునే స్వేచ్ఛ విమాన సంస్థల‌కు ల‌భిచింది. గతంలో 1937 విమాన నియమాల్లోని రూల్ 135(4) ప్రకారం అధిక లేదా దోపిడీ ధరలు, గుత్తాధిపత్య పద్ధతులపై డీజీసీఏకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉండేది. తాజాగా తీసుకొచ్చిన రూల్ 192లో ఆ అంశాలను ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, అసాధారణ పరిస్థితుల్లో కేంద్రానికి జోక్యం చేసుకునే అధికారం కల్పించారు. దీంతో విమాన ప్రయాణికులకు ధరల విషయంలో కొంత ఊరట లభించే అవకాశం ఉంది.

Also Read..

పంజాబ్ ఎన్నిక‌ల‌కు ముందు ఆప్‌కు భారీ షాక్‌.. బీజేపీలో చేరిన‌ ముగ్గురు ఎమ్మెల్యేలు

ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహ‌న‌దారుల‌పై కొర‌డా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 ల‌క్ష‌ల ఫైన్ వ‌సూలు

దీపావ‌ళి త‌ర్వాతే.. క‌రీంన‌గ‌ర్‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్‌

ట్యాగ్స్:

Airline Ticket PricesAviation Turbine FuelBharatiya Vayuyan Niyam 2026Centre Notifies New RulesDGCAUnion Ministry Of Civil Aviation
Advertisement
Advertisement