Kishan Reddy | నేషనల్ లీడర్ కావాలని రేవంత్ ఆరాటపడుతుండు
Kishan Reddy | నేషనల్ లీడర్ (National Leader) కావాలని సీఎం రేవంత్ (CM Revanth) మస్తు ఆరాటపడుతుండని.. అందుకే జాతీయ మీడియాను ఆకర్షించడానికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నాడని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు.
- పబ్లిసిటీ కోసమే జాతీయ మీడియాను ఆకర్షించే పనిలో ఉన్నడు
- ఇగ రాహుల్‌కేమో ప్రధాని కుర్చి మీదనే మోజుంది
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
Kishan Reddy | త్రినేత్ర న్యూస్: నేషనల్ లీడర్ (National Leader) కావాలని సీఎం రేవంత్ (CM Revanth) మస్తు ఆరాటపడుతుండని.. అందుకే జాతీయ మీడియాను ఆకర్షించడానికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతున్నాడని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. పబ్లిసిటీ మీదనే దృష్టి పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఇక రాహుల్‌గాంధీకేమో కేవలం ప్రధాని కుర్చీపైనే మోజుందని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్, రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నరు
రేవంత్ రెడ్డి జాతీయ నేతగా ఎదగాలనుకుంటుండు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడటం అలవాటుగా మార్చుకున్నడు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. విదేశీ శక్తులతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నారు. దేశంలో అశాంతిని సృష్టించడమే ధ్యేయంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీకి కేవలం ప్రధాని కుర్చీపైనే దృష్టి తప్ప దేశ సంక్షేమం మీద సోయి లేదు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన, పటిష్టమైన పాలన కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ పన్నుతున్న కుట్రలు, రాహుల్ గాంధీ వైఖరిని ప్రజల ముందు ఎండగడతాం. ఇందులో భాగంగానే ఇకపై అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా పాదయాత్రలు చేపట్టి ప్రజలకు నిజాలను వివరిస్తాం అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?
- ●KTR | హైదరాబాదే కాదు.. పల్లెల్లోనూ ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చు
- ●Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి - విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్
- ●Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
- ●Raptadu | రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు.. రాప్తాడు దాడి నిందితుడికి శస్త్రచికిత్స
- ●Airline Ticket Prices | ప్రయాణికులకు ఊరట.. విమాన ఛార్జీలపై కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?

KTR | హైదరాబాదే కాదు.. పల్లెల్లోనూ ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చు

Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి - విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్

Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు





