త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rababaali OTT | థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీలోకి ర‌ణ‌బాలి – విజ‌య్‌, ర‌ష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. న‌వంబ‌ర్ 13 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Nov 2, 2026, 1.59 pm IST

Rababaali OTT | థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీలోకి ర‌ణ‌బాలి – విజ‌య్‌, ర‌ష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్
Advertisement

Rababaali OTT |టాలీవుడ్ రియ‌ల్‌లైఫ్ క‌పుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda ), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna)జంట‌గా న‌టించిన ర‌ణ‌బాలి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ అనుకోకుండా లీకైంది.
హిస్టారిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ర‌ణ‌బాలి న‌వంబ‌ర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల కాబోతుంది. తెలుగుతో పాటు మ‌రో నాలుగు భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‌ను వెల్ల‌డిస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట్ పెట్టింది. కొద్ది సేప‌టికే ఆ పోస్ట్‌ను డిలేట్ చేసింది.

పోస్ట్ డిలీట్‌...

ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 16న థియేట‌ర్ల‌లో రిలీజైన ర‌ణ‌బాలి ఇప్ప‌టికీ హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో థియేట‌ర్ల‌లో ఆడుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప‌ది రోజుల ముందే రివీల్ చేస్తే వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టే అవ‌కాశం ఉంది. నిర్మాత‌ల రిక్వెస్ట్ మేర‌కే నెట్‌ఫ్లిక్స్ ఈ పోస్ట్‌ను డిలీట్ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సూప‌ర్‌హిట్‌గా నిలిచిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో ఆడుతుండ‌గానే ఓటీటీలోకి రాబోతుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాయ‌ల‌సీమ క‌రువు...

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ర‌ణ‌బాలికి రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. 1870వ ద‌శ‌కంలో రాయ‌ల‌సీమ‌లో ఏర్ప‌డిన క‌రువు ప‌రిస్థితుల‌కు తోడు బ్రిటీష‌ర్లు సాగించిన అకృత్యాల‌ను ఎదురించి ర‌ణ‌బాలి అనే యోధుడు సాగించిన పోరాటంతో ఈ మూవీ రూపొందింది. విజ‌య్‌, ర‌ష్మిక యాక్టింగ్‌, రాహుల్ సాంకృత్యాన్ క‌థ‌, క‌థ‌నాల‌ను రాసుకున్న తీరుకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. నిజాయితీతో కూడిన మంచి ప్ర‌య‌త్నంగా ప్రేక్ష‌కుల‌ను చెబుతోన్నారు.

81 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఇప్ప‌టివ‌ర‌కు ఈ మూవీ 81 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఇటీవ‌లే లాభాల్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌రుస డిజాస్ట‌ర్ల‌కు బ్రేక్ ప‌డింది.

శింగ‌న‌మ‌ల ర‌ణ‌బాలి...

రాయ‌ల‌సీమ‌లోని శింగ‌న‌మ‌ల ఊరికి ర‌ణ‌బాలి సంర‌క్ష‌కుడిగా ఉంటాడు. మొర‌టోడిగా పెరిగిన‌ ర‌ణ‌బాలిలో భార్య జ‌య‌మ్మ మార్పు తీసుకొస్తుంది. మ‌ద్రాస్ ప్రెసెడెన్సీకి కొత్త క‌మీష‌న‌ర్‌గా వ‌చ్చిన థియేడ‌ర్ హెక్ట‌ర్ క‌రువుతో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్న ప‌ట్టించుకోకుండా వారు దాచుకున్న ధాన్యాన్ని ప‌న్నుల పేరుతో దోచేస్తుంటాడు. థియేట‌ర్ హెక్ట‌ర్ అన్యాయాల‌కు ర‌ణ‌బాలి ఎందుకు ఎదురుతిరిగాడు? భ‌ర్త పోరాటానికి జ‌య‌మ్మ ఎలా అండ‌గా నిలిచింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

ట్యాగ్స్:

Historical Action MovieNetflixRahul SankrityanRanabaali CollectionsRanabaali MovieRanabaali OTT Release DateRashmika MandannaVijay DeverakondaVirosh
Advertisement
Advertisement