KTR | హైదరాబాదే కాదు.. పల్లెల్లోనూ ఐటీ కంపెనీలు పెట్టుకోవచ్చు
KTR | హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో కేటీఆర్ (KTR) క్యాంపస్ హబ్-ఏఐ ప్రొడక్ట్ (Campus Hub AI Product)ను ప్రారంభించారు. నలుగురు గ్రామీణ యువకులు కలిసి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు.
- నలుగురు గ్రామీణ ప్రాంత యువకులు క్యాంపస్ హబ్-ఏఐ ప్రారంభించడం గొప్ప విషయం
- నేటి విద్యా వ్యవస్థలో టెక్నాలజీ ఎంతో అవసరం
- ఏఐ భూతం కాదు.. మానవాళికి దూతం లాంటిది
- అధికారంలోకి వచ్చాక అన్ని శాఖలకు ఏఐని అనుసంధానిస్తం
- దానికే మొదటి ప్రాధాన్యం ఉంటది
- నానక్‌రామ్‌గూడలోని షెరటాన్ హోటల్లో క్యాంపస్ హబ్-ఏఐ ప్రొడక్ట్ లాంచ్‌లో కేటీఆర్ వ్యాఖ్యలు
KTR | త్రినేత్ర న్యూస్: ఐటీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాదే కేంద్రం కావాల్సిన అవసరం లేదని.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకోవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడంట్ కేటీఆర్ (KTR) అన్నారు. నలుగురు గ్రామీణ ప్రాంత యువకులు కలిసి నానక్‌రామ్‌గూడలో షెరటాన్ హోటల్లో క్యాంపస్ హబ్-ఏఐ ప్రొడక్ట్ (Campus Hub AI Product)ను ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. నేటి విద్యా వ్యవస్థ టెక్నాలజీ ఎంతో అవసరమని చెప్పారు. ఎక్కడ అవసరమో అక్కడే ఏఐని ఉపయోగించాలని పేర్కొన్నారు. సోమవారం క్యాంపస్ హబ్-ఏఐ ప్రొడక్ట్ ప్రారంభం సందర్భంగా ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐని అనుసంధానిస్తామన్నారు.
CampusHub AI ప్రారంభించడం సంతోషంగా ఉంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన నలుగురు కలిసి కొత్తగా క్యాంపస్ హబ్ AI ప్రారంభించడం గొప్ప విషయం. ఈ నలుగురు యువకులు సమాజానికి ఆదర్శం. యువత గొప్పగా ఆలోచించండి.. గొప్పగా ఎదగండి. గతంలో తెలంగాణలో ఐటీ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మనం ముందుకు సాగాలి. నేటి విద్యావ్యవస్థలో టెక్నాలజీ ఎంతో కీలకం. ఏఐ భూతం కాదు.. మానవాళికి ఒక దూతం లాంటిది.
గతంలోనే వ్యవసాయ రంగంలో ఏఐ ద్వారా మార్పులు తీసుకురావాలని ప్రయత్నించాం. సిరిసిల్లలోని ఒక గ్రామంలో ఏఐ ఆధారిత వ్యవసాయ ప్రాజెక్టును చేపట్టాం. పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏఐని ఉపయోగించాలనుకున్నాం. Artificial Intelligence for Agriculture Innovationను ప్రారంభించాం. ల్యాండ్‌లైన్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది.
ఎక్కడ అవసరమో అక్కడే ఉపయోగించాలి
రాబోయే కాలమంతా ఏఐదే కీలక పాత్ర. ఇప్పటికే డ్రైవర్‌లెస్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఐటీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ మాత్రమే కేంద్రం కావాల్సిన అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకోవచ్చు. పరకాలలో రాకేష్ అనే యువకుడు ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడం అభినందనీయం. ప్రభుత్వం కూడా ఏఐ టెక్నాలజీని ప్రోత్సహించాలని కోరుతున్నాం. ఎక్కడ అవసరమో అక్కడే ఏఐని ఉపయోగించాలి.
దుర్వినియోగం చేయొద్దు
ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేయకూడదు. రెండేళ్ల తర్వాత కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని ప్రభుత్వ శాఖలకు ఏఐని అనుసంధానం చేస్తాం. అన్ని రంగాల్లో ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని విస్తరించేలా చర్యలు తీసుకుంటాం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?
- ●Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి - విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్
- ●Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు
- ●Raptadu | రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు.. రాప్తాడు దాడి నిందితుడికి శస్త్రచికిత్స
- ●Kishan Reddy | నేషనల్ లీడర్ కావాలని రేవంత్ ఆరాటపడుతుండు
- ●Airline Ticket Prices | ప్రయాణికులకు ఊరట.. విమాన ఛార్జీలపై కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంటది..?

Rababaali OTT | థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రణబాలి - విజయ్, రష్మిక సినిమా స్ట్రీమింగ్ డేట్ లీక్

Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచారణను ముగించిన సుప్రీంకోర్టు

Raptadu | రెండు కాళ్లలో మూడు బుల్లెట్లు.. రాప్తాడు దాడి నిందితుడికి శస్త్రచికిత్స





