త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచార‌ణ‌ను ముగించిన సుప్రీంకోర్టు

Supreme Court | అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం కేసు విచార‌ణ‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ముగించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తన దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో సుప్రీం ధ‌ర్మాస‌నం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

D

National | Published On Nov 2, 2026, 1.55 pm IST

Supreme Court | అయోధ్య విరాళాల కేసు విచార‌ణ‌ను ముగించిన సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court | త్రినేత్ర న్యూస్ : అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్య‌వ‌హారంపై స్వతంత్ర దర్యాప్తు (Independent Investigation) జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సోమవారం ముగించింది. నిధుల దుర్వినియోగం జ‌రిగిందంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తన దర్యాప్తును పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలపడంతో ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, వి.మోహ‌నాల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాద‌న‌లు వినిపించారు. ఆలయంలోని విరాళాలను దుర్వినియోగం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైందని సుప్రీంకోర్టుకు తెలిపారు. నిందితులు కొందరు అక్రమంగా దారి మళ్లించిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేయగా, మరికొందరు ఆ డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన‌ట్లు తేలింద‌ని చెప్పారు. ఆలయ విరాళాల దుర్వినియోగానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి, అయోధ్య జ్యుడీషియల్​ మేజిస్ట్రేట్​ కోర్టులో ఛార్జ్​షీట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వినిపించిన‌ వాదనలను నోట్‌ చేసుకున్న సుప్రీం ధ‌ర్మాస‌నం.. సిట్ ద‌ర్యాప్తు పూర్తై ఛార్జ్‌షీట్ కూడా దాఖ‌లైనందున ఈ పిటిష‌న్ల‌పై మ‌రింత విచార‌ణ అవ‌స‌రం లేద‌ని ధ‌ర్మాసనం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పిటిష‌న్ల‌ను క్లోజ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఇక ఈ వ్య‌వ‌హారంపై తదుపరి విచారణ స్థానిక కోర్టులోనే జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు చట్ట ప్రకారం కేసును ముందుకు తీసుకెళ్లాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఒక‌వేళ పిటిష‌న‌ర్ల‌కు ఇంకా ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే చ‌ట్ట‌ప్ర‌కారం దిగువ కోర్టుల‌ను ఆశ్ర‌యించేందుకు అనుమ‌తించింది. ఈ విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై (merits of the case) తాము ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తపరచడం లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read..

ప్రయాణికులకు ఊరట.. విమాన ఛార్జీలపై కొత్త రూల్స్‌ను నోటిఫై చేసిన కేంద్రం

పంజాబ్ ఎన్నిక‌ల‌కు ముందు ఆప్‌కు భారీ షాక్‌.. బీజేపీలో చేరిన‌ ముగ్గురు ఎమ్మెల్యేలు

ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహ‌న‌దారుల‌పై కొర‌డా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 ల‌క్ష‌ల ఫైన్ వ‌సూలు

ట్యాగ్స్:

AyodhyaAyodhya Ram TempleRam Temple Donation RowSITSupreme CourtUP
Advertisement
Advertisement