త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంట‌ది..?

Chhattisgarh | దేశంలో ముఖ్య‌మైన‌ ఖనిజాల అన్వేషణలో కీల‌క ముందడుగు పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని భాలుకోనా ప్రాంతంలో నికెల్, రాగి, ప్లాటినం గ్రూప్ ఖనిజాలకు సంబంధించిన 40 లక్షల టన్నులకు పైగా ఖనిజీకరణ అవకాశాలను గుర్తించారు. ప్రాథమిక భౌగోళిక అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

S

Business | Published On Nov 2, 2026, 2.10 pm IST

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం.. 40 లక్షల టన్నులు గుర్తింపు.. ఏంట‌ది..?
Advertisement

Chhattisgarh | దేశంలో ముఖ్య‌మైన‌ ఖనిజాల అన్వేషణలో కీల‌క ముందడుగు పడింది. ఛత్తీస్‌గఢ్‌లోని భాలుకోనా ప్రాంతంలో నికెల్, రాగి, ప్లాటినం గ్రూప్ ఖనిజాలకు సంబంధించిన 40 లక్షల టన్నులకు పైగా ఖనిజీకరణ అవకాశాలను గుర్తించారు. ప్రాథమిక భౌగోళిక అధ్యయనాల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఎక్క‌డ బ‌య‌ట ప‌డింది..?

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఖనిజ నిక్షేపం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని మహాసముంద్ జిల్లా, బసనా తహసీల్ పరిధిలో ఉన్న భాలుకోనా ప్రాంతంలో డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థ చేపట్టిన అన్వేషణ డ్రిల్లింగ్‌లో ఈ కీలక విషయాలు వెల్లడయ్యాయి. కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ప్రకటన ప్రకారం ప్రాథమిక భౌగోళిక నమూనాలు 40 లక్షల టన్నులకు పైగా ఖనిజీకరణ అవకాశాలను సూచిస్తున్నాయి. వీటిలో నికెల్ సమానమైన ఖనిజ గ్రేడ్ సుమారు 0.24 శాతంగా అంచనా వేశారు. ఇందులో నికెల్‌తోపాటు రాగి, ప్లాటినం, పల్లాడియం ఖనిజాల వాటాను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

ఎంత మొత్తంలో ఉంది..?

సుమారు 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతంలో కంపెనీ మార్చి నుంచి 15 డైమండ్ కోర్ డ్రిల్లింగ్ రంధ్రాల ద్వారా మొత్తం 2,773 మీటర్ల మేర తవ్వకాలు చేపట్టింది. ఈ పరిశోధనల్లో 1.3 కిలోమీటర్ల పొడవు, 100 మీటర్లకు పైగా వెడల్పు ఉన్న ఖనిజీకరణ ప్రాంతాన్ని గుర్తించారు. ప్రస్తుతం వెల్లడించిన 40 లక్షల టన్నుల అంచనా మొత్తం ఖనిజీకరణ ప్రాంతంలో కేవలం 25 శాతం మేరకే పరిమితమైంది. అయితే, ఇది ప్రాథమిక అన్వేషణ ఫలితం మాత్రమేనని, ఇంకా అధికారికంగా ధ్రువీకరించిన ఖనిజ వనరు లేదా నిల్వగా ప్రకటించలేదని గుర్తించాలి. తదుపరి పరిశోధనలు, మరిన్ని డ్రిల్లింగ్ పరీక్షల అనంతరమే వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాలపై స్పష్టత రానుంది. దేశంలో కీలక ఖనిజాల దేశీయ లభ్యతను పెంచే దిశగా ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్:

Bhalukona ProjectChhattisgarhCopper DepositsDeccan Gold MinesNickel Deposits
Advertisement
Advertisement