Bus Accident | కాల్వలో పడ్డ మినీ బస్సు.. ఎనిమిది మంది భక్తులు మృతి
Bus Accident | రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. భోపాల్ నుంచి కోటాలోని కతు శ్యామ్ ఆలయానికి (Khatu Shyam Temple) భక్తులతో వెళ్తున్న మినీ బస్సు ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పి కాలువలో పడిపోయింది.
Bus Accident | త్రినేత్ర న్యూస్: రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. భోపాల్ నుంచి కోటాలోని కతు శ్యామ్ ఆలయానికి (Khatu Shyam Temple) భక్తులతో వెళ్తున్న మినీ బస్సు ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై అదుపుతప్పి కాలువలో పడిపోయింది. దీంతో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో సిమ్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కాలువలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

నీరు, బురదతో నిండిన కాలువలోకి బస్సు పడిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. గాయపడిన వారిని కోటాలోని దవాఖానకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ పీయూశ్ సమారియా తెలిపారు. ప్రస్తుతం వారందరికి చికిత్స అందిస్తున్నామని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ప్రమాదంలో ఎనిమిది మంది మరణించినట్లు ధృవీకరించారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారని చెప్పారు.
సంబంధిత వార్తలు

Bus Accident | అంత్యక్రియలకు వెళ్తుండగా.. అనంతగిరి ఘాట్‌రోడ్డులో బస్సు బోల్తా.. ఐదుగురు దుర్మరణం
అక్టోబర్ 3, 2026

Special Train | ఈ నెల 4, 5 తేదీల్లో సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు..
అక్టోబర్ 3, 2026

Harish Rao | ఇక్కడ పంటలు ఎండుతుంటే.. రాజస్థాన్‌కు కరెంటు అమ్ముకుంటరా?
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●IPO | వచ్చే వారం రెండు భారీ ఐపీఓలు.. రూ.31,663 కోట్ల సమీకరణ..
- ●Navaratri Brahmotsavam | ఘంటానాదం.. నైవేద్యానికి సంకేతం!
- ●US Sanctions | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట!
- ●Flights Cancelled | మరో వారం రోజులు.. సౌదీ అరేబియాకు భారత విమాన సర్వీసులు రద్దు
- ●Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం
- ●LK Advani | ఛాతీలో ఇన్ఫెక్షన్.. దవాఖానలో చేరిన ఎల్కే అద్వానీ

IPO | వచ్చే వారం రెండు భారీ ఐపీఓలు.. రూ.31,663 కోట్ల సమీకరణ..

Navaratri Brahmotsavam | ఘంటానాదం.. నైవేద్యానికి సంకేతం!

US Sanctions | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట!

Flights Cancelled | మరో వారం రోజులు.. సౌదీ అరేబియాకు భారత విమాన సర్వీసులు రద్దు



