AAP MLAs join BJP | పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
AAP MLAs join BJP | పంజాబ్‌లో ఎన్నికలకు (Punjab elections) ముందు ముగ్గురు ఆప్ (AAP) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. సనూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ సోమవారం ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
AAP MLAs join BJP | త్రినేత్ర న్యూస్ : పంజాబ్ రాజకీయాల్లో (Punjab elections) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి భారీ షాక్ తగిలింది. ఆప్ తీరుపై అసంతృప్తితో ఉన్న ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీ (BJP)లో చేరారు. సనూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా, సమానా ఎమ్మెల్యే చేతన్ సింగ్ జౌరామజ్రా ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక అమృత్‌సర్ నార్త్ ఎమ్మెల్యే, మాజీ ఐపీఎస్ అధికారి కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ సోమవారం ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి బీజేపీ గూటికి చేరారు. ఇవాళ ఉదయం బీజేపీ నేతల సమక్షంలో వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి, అవినీతి, శాంతిభద్రతల క్షీణతను అరికట్టడంలో ఆప్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు.
మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల (2027 Punjab Assembly elections) కోసం ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. 40 మంది సిట్టింగులతో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఆ జాబితాలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు దక్కకపోవడం, వారి నియోజకవర్గాలకు వేరే ఇన్‌చార్జ్‌లను నియమించడంతో వారు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే రాజీనామాలు చేసి బీజేపీలో చేరినట్లుగా సమాచారం. ఏది ఏమైనా ఎన్నికలకు కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో పట్టున్న ముగ్గురు నేతలు పార్టీ మారడం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Also Read..
గ్రోక్ వినియోగదారులకు షాక్.. త్వరగా ముగుస్తున్న పరిమితులు.. మస్క్ ఏమన్నారంటే..?
దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
నవంబర్ 2, 2026

Traffic Restrictions | హైదరాబాద్‌లో అమిత్‌షా పాదయాత్ర.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
నవంబర్ 2, 2026

Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ కౌంటర్
నవంబర్ 1, 2026
తాజావార్తలు
- ●Elon Musk | గ్రోక్ వినియోగదారులకు షాక్.. త్వరగా ముగుస్తున్న పరిమితులు.. మస్క్ ఏమన్నారంటే..?
- ●Ghatkesar Bandh | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడి విద్యాసంస్థలు, దుకాణాలు
- ●Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహనదారులపై కొరడా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 లక్షల ఫైన్ వసూలు
- ●Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- ●Gold And Silver Prices Today | మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్..
- ●Instinct AI | వాట్సాప్‌లో ఏఐ అసిస్టెంట్ ఇన్‌స్టింక్ట్‌పై వివాదం.. యూజర్ ఖాతా బ్యాన్..

Elon Musk | గ్రోక్ వినియోగదారులకు షాక్.. త్వరగా ముగుస్తున్న పరిమితులు.. మస్క్ ఏమన్నారంటే..?

Ghatkesar Bandh | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడి విద్యాసంస్థలు, దుకాణాలు

Delhi Pollution Curbs | ఢిల్లీలో వాయు కాలుష్యం.. వాహనదారులపై కొరడా ఝుళిపించిన అధికారులు.. తొలిరోజే రూ.68 లక్షల ఫైన్ వసూలు

Nitin Nabin | దీపావళి తర్వాతే.. కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్



