త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raptadu | రెండు కాళ్ల‌లో మూడు బుల్లెట్లు.. రాప్తాడు దాడి నిందితుడికి శ‌స్త్ర‌చికిత్స‌

Raptadu | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం (Anantapur) జిల్లా రాప్తాడు (Raptadu ) జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిపై ఎల‌క్ట్రిక్ రంపంతో దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. నిందితుడు డుంబు హేమంత్‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో అత‌నిపై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు.

G

Andhra pradesh | Published On Nov 2, 2026, 1.21 pm IST

Raptadu | రెండు కాళ్ల‌లో మూడు బుల్లెట్లు.. రాప్తాడు దాడి నిందితుడికి శ‌స్త్ర‌చికిత్స‌
Advertisement

Raptadu | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం (Anantapur) జిల్లా రాప్తాడు (Raptadu ) జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థినిపై ఎల‌క్ట్రిక్ రంపంతో దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. నిందితుడు డుంబు హేమంత్‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో అత‌నిపై పోలీసులు ఆదివారం కాల్పులు జరిపారు. దీంతో అత‌ని రెండు కాళ్ల‌లో మూడు బుల్లెట్లు ఇరుకున్నాయి. ఈ నేప‌థ్యంలో అనంతపురం ప్రభుత్వ ద‌వాఖాన‌లో వైద్యులు అత‌నికి శస్త్రచికిత్స (Surgery) చేశారు. రెండు కాళ్ల‌లో ఉన్న‌ బుల్లెట్లను తొలగించారు. ప్ర‌స్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం ఏఎంసీ వార్డుకు తరలించి ప్రత్యేక భద్రత మధ్య చికిత్స అందిస్తున్నారు.

కాగా, శ‌నివారం (అక్టోబ‌ర్ 31న‌) రాప్తాడు జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో పదో తరగతి చదువుతున్న (10th Class Student) విద్యార్థిపై ఉన్మాది హేమంత్.. చెట్లు నరికే రంపం మెషిన్‌తో దాడిచేశాడు. విద్యార్థిని ముఖం, ఒంటిపై ఎక్కడికక్కడ నరికాడు. ఆ దాడితో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రాణాపాయస్థితిలోకి వెళ్లింది. అడ్డుకోబోయిన మరో విద్యార్థిని కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అనంత‌రం హేమంత్‌ అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. దీంతో నిందితుడిని ప‌ట్టుకునేందుకు 25 ప్ర‌త్యేక పోలీసు బృందాలు రాత్రంతా గాలింపు చేప‌ట్టాయి.

ఈ క్ర‌మంలో ఆత్మ‌కూరు స‌మీపంలోని అడ‌వుల్లో ఉన్నాడ‌నే ప‌క్కా స‌మాచారంతో పోలీసులు అక్క‌డికి వెళ్లారు. అత‌డిని ప‌ట్టుకునే క్ర‌మంలో పోలీసుల‌పై క‌త్తితో దాడికి య‌త్నించాడు. దీంతో రాప్తాడు సీఐ వెంకటేశ్​ ఎడమ భుజం కింది భాగంలో గాయాలయ్యాయి. రాయదుర్గం రూరల్‌ సీఐ వెంకటరమణ కింద పడిపోవడంతో శరీరంపై పలుచోట్ల గీసుకుపోయింది. అయితే ఆత్మ‌ర‌క్ష‌ణ కోసం పోలీసులు ఆరు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో నిందితుడి మోకాళ్ల‌లోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్ల‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌డిని అనంత‌పురం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అక్క‌డ చికిత్స పొందుతున్నాడు.

కాగా, నిందితుడికి తొలి నుంచే నేర ప్రవృత్తి ఉన్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మరణించడంతో అక్క వద్ద కొంత కాలం ఉన్నాడు. హేమంత్ ప్రవర్తన నచ్చకపోవడంతో అక్క అతన్ని ఇంట్లో నుంచి పంపేసింది. అప్పటి నుంచీ అనంతపురం శివారులో అద్దె గదిలో ఉంటూ టమోటా మండీలో కూలీగా పనిచేస్తున్నాడు. మద్యం, గంజాయికి పూర్తిగా బానిసైనట్లు సమాచారం. గతంలోనూ రాప్తాడు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులపై దాడి చేసినట్లు సమాచారం. ఆ తర్వాత కొంత కాలంగా. సమీప బంధువైన బాలిక వెంటపడి వేధించినట్లు తెలిసింది. ఈ విషయం బాలిక కుటంబసభ్యులకు చెప్పింది. ఈ క్రమంలోనే శనివారం పాఠశాల గదిలోకి చొరబడి బాలికపై దాడి చేశాడు.

ట్యాగ్స్:

10th Class StudentAnantapurBulletsRaptaduRaptadu IncidentSurgery
Advertisement
Advertisement