Heavy Rain | తెలంగాణలో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. కొత్తమొల్గరలో అత్యధికంగా 11 సెం.మీ.
Heavy Rain | తెలంగాణలో అర్ధరాత్రి వాన (Heavy Rain) దంచికొట్టింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఉరుమురు, మెరుపులతో కూడిన వాన పడింది.
Heavy Rain | త్రినేత్ర.న్యూస్: తెలంగాణలో అర్ధరాత్రి వాన (Heavy Rain) దంచికొట్టింది. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. మహబూబ్‌నగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఉరుమురు, మెరుపులతో కూడిన వాన పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సంగారెడ్డిలో వ్యవసాయ మార్కెట్‌లో వడ్లు కొట్టుకుపోయాయి.
అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా కొత్తమొల్గరలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయింది. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని పర్పల్లిలో 10, భూత్పూర్‌లో 10, వనపర్తి జిల్లా అమరచింతలో 8.85, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 8.83, మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేటలో 7.8, మహబూబ్‌నగర్ టౌన్, జానంపేటలో 7.6, సంగారెడ్డి జిల్లా పల్వట్లలో 7.4, సిద్దిపేట జిల్లా శనిగరంలో 7.2, అంగడ కిష్టాపూర్‌లో 6.5, నల్లగొండ జిల్లా డిండిలో 6.2, సంగారెడ్డి జిల్లా హత్నూరలో 6, నిజామాబాద్ దర్పల్లిలో 5.4, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో 5, కామారెడ్డి జిల్లా దోమకొండలో 5, సదాశివనగర్‌లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిసింది. కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
MASSIVE WIDESPREAD RAINS have lashed various parts of South, Central, West TG districts mainly Siddipet, Sangareddy, Medak, Kamareddy, Mahabubnagar, Wanaparthy, Nagarkurnool, Gadwal, Narayanpet, Nizamabad, Vikarabad during overnight hours ⛈️⚠️🌧️⛈️⚠️
State highest
Bhoothpur,… pic.twitter.com/nQoLlpwCrl— Telangana Weatherman (@balaji25_t) May 27, 2026
సంబంధిత వార్తలు

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
ఆగస్టు 13, 2026

Niranjan Reddy | కేసీఆర్ మీద కక్ష.. రైతు బీమా పథకం నిలిపివేత
ఆగస్టు 13, 2026

MLA Pocharam Srinivas reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. రాజకీయం వదులుకుంటా : ఎమ్మెల్యే పోచారం
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
- ●Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!
- ●MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
- ●Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●V Hanumantha Rao | చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జికి ఆ యోధురాలి పేరు పెట్టండి.. సీఎం రేవంత్‌కు వీహెచ్ లేఖ
- ●Niranjan Reddy | కేసీఆర్ మీద కక్ష.. రైతు బీమా పథకం నిలిపివేత

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు

Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి

Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..



