Siddaramaiah | రేపు కర్ణాటక సీఎం రాజీనామా.. రాజ్యసభకు సిద్ధరమయ్య!
Siddaramaiah | కర్ణాటకలో (Karnataka) ముఖ్యమంత్రి మార్పు కథ క్లైమాక్స్‌కు చేరింది. సీఎం సిద్ధరమయ్య (Siddaramaiah) తన పదవికి రాజీనామా చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన డీకే శివకుమార్‌కు (DK Shivakumar) పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
Siddaramaiah | త్రినేత్ర.న్యూస్: కర్ణాటకలో (Karnataka) ముఖ్యమంత్రి మార్పు కథ క్లైమాక్స్‌కు చేరింది. సీఎం సిద్ధరమయ్య (Siddaramaiah) తన పదవికి రాజీనామా చేయనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన డీకే శివకుమార్‌కు (DK Shivakumar) పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
సీఎం సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమవుతున్నారని, ఆయనకు రాజ్యసభ (Rajya Sabha) సీటుతోపాటు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే తన అనుచరులతో చర్చించిన ఆయన హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సమాచారం. గురువారం తొలుత సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి, అనంతరం బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పిస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న `ముఖ్యమంత్రి మార్పు`పై కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో ఆరుగంటల పాటు సాగిన సమావేశం తర్వాత ఈ వివాదాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి రణ్‌దీప్ సుర్జేవాలాతో పాటు సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో సిద్ధరామయ్య సీఎం పదవిని వదులుకొని, రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు సహకరించాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం. ఆయనకు రాజ్యసభ స్థానంతోపాటు సభలో విపక్ష నేతగానూ అవకాశం ఇస్తామని ప్రతిపాదించినట్లు తెలిసింది.

మరోవైపు చర్చల అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో త్వరలో జరుగనున్న మూడు రాజ్యసభ స్థానాలు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ప్రధానంగా చర్చించారు. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగాలు మాత్రమేనని కొట్టిపారేశారు. సీఎం సిద్ధరామయ్య కూడా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వ మార్పు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశాలేవీ చర్చకు రాలేదని పేర్కొన్నారు.
కాగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సర్దీప్ సుర్జేవాలా బుధవారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకోనున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. సిద్దరామయ్య వర్గాన్ని సమతుల్యం చేసేందుకు నూతన ప్రభుత్వంలో పలువురు ఉపముఖ్యమంత్రులను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను మంత్రులుగాను నియమించున్నారని తెలుస్తున్నది.
పవర్ షేరింగ్ ఫార్ములా..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య 'పవర్ షేరింగ్' (Power Sharing) ఒప్పందం జరిగిందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో, ఇక డీకేఎస్‌కు ఛాన్స్ దక్కుతుందని ఆయన మద్దతుదారులు గట్టిగా నమ్మారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత (Anti-incumbency) పెరుగుతోందని, ప్రియాంకా గాంధీ కూడా మార్పును కోరుకుంటున్నారని ప్రచారం జరగడంతో ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
సంబంధిత వార్తలు

MP Gaurav Gogoi | కుంభకర్ణుడు నిద్ర లేచారు.. అమిత్ షాపై గౌరవ్ గొగోయ్ సంచలన వ్యాఖ్యలు
ఆగస్టు 13, 2026

Mallikarjun Kharge | ఆ ఘటన చాలా అవమానంగా అనిపించింది.. హల్ద్వానీలో వేదిక శుద్ధిపై ఖర్గే భావోద్వేగం
ఆగస్టు 13, 2026

Ponnam Prabhakar | ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు.. 100 శాతం సబ్సిడీతో బీసీ మహిళలకు: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
- ●Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!
- ●MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి
- ●Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..
- ●V Hanumantha Rao | చంచల్‌గూడ స్టీల్ బ్రిడ్జికి ఆ యోధురాలి పేరు పెట్టండి.. సీఎం రేవంత్‌కు వీహెచ్ లేఖ
- ●Niranjan Reddy | కేసీఆర్ మీద కక్ష.. రైతు బీమా పథకం నిలిపివేత

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. 'రాంప్'పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు

Janhvi Kapoor | నో గ్లామర్ - అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ - దీపికా, రష్మికలకు ధీటుగా!

MP Vaddiraju Ravichandra | డీలర్లకు మార్జిన్ పెంచండి.. కేంద్ర మంత్రికి ఎంపీ వద్దిరాజు వినతి

Stock Markets | వరుసగా నాలుగో సెషన్లోనూ మిశ్రమ ధోరణి.. తీవ్ర అస్థిరతతో కదిలిన సూచీలు..



