Bhatti Vikramarka | వ్యవసాయ రంగానికి రూ. 1,67,877 కోట్లు ఖర్చు చేశాం : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka | ఈ రెండున్నరేండ్లలోనే రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచిందని, వ్యవసాయ రంగానికి అనేక నిధులు వెచ్చించామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ 30 నెలల కాలంలోనే వ్యవసాయ రంగానికి ఒక లక్షా 67 వేల 877 కోట్ల రూపాయాలను వెచ్చించామని ఆయన తెలిపారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : ఈ రెండున్నరేండ్లలోనే రైతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచిందని, వ్యవసాయ రంగానికి అనేక నిధులు వెచ్చించామని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ 30 నెలల కాలంలోనే వ్యవసాయ రంగానికి ఒక లక్షా 67 వేల 877 కోట్ల రూపాయాలను వెచ్చించామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు.
వ్యవసాయం మన సంస్కృతి. మన జీవన విధానం. రైతు భరోసా పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు మీద ఎకరానికి రూ. 5 వేలు ఇచ్చారు. అది కూడా 145 నుంచి 169 రోజులకు ఇచ్చేవారు. కానీ మన ప్రభుత్వం.. ఏది ఏమైనా రైతాంగ సోదరులకు రైతు భరోసా 9 రోజుల్లో 9 వేల కోట్లు వేసి తీరాల్సిందే అని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేటికి కూడా రైతు భరోసా కార్యక్రమం కొనసాగుతుంది. 8 వేల ఎకరాలకు వరకు డబ్బులు పడ్డాయి. ఇవాళ 9 నుంచి 54 ఎకరాలలోపు రైతులకు 16 లక్షల 87 వేల ఎకరాలకు ఒక వేయి 9 కోట్లు జమ చేస్తున్నమని భట్టి తెలిపారు.
ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజీకి డబ్బులు చెల్లించింది
కేవలం రైతు భరోసా మాత్రమే కాదు.. 9 వేల కోట్లు విడుదల చేసి ఊరుకోలేదు. రైతును రాజుగా చూడాలని పండించిన పంటను కొనుగోళ్లు చేస్తున్నాం. ఆ ధాన్యానికి వెంటనే నిధులు వేయించిన సంగతి తెలిసిందే. మొక్కజొన్న, జొన్న ఏ రాష్ట్రం కొనుగోలు చేయకపోయినా.. మన రాష్ట్రంలో కొనుగోలు చేశాం మార్క్‌ఫెడ్ నుంచి. ఇది బహుషా మన పొరుగు రాష్ట్రంలో మొక్కజొన్నను కొనుగోలు చేయలేదని రైతులు చెప్పారు. మిగిలిన డబ్బులను మొక్కజొన్న రైతులకు కూడా మార్క్ ఫెడ్ నుంచి విడుదల చేయబోతున్నాం. రైతుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం ఇది. రైతు భరోసా, కొనుగోళ్లు చేయడమే కాదు.. రైతు రుణమాఫీ చేశాం. పండించిన పంటకు బోనస్ కూడా ఇచ్చాం. క్రాప్ డ్యామేజీకి గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ మన ప్రజా ప్రభుత్వం క్రాప్ డ్యామేజీకి డబ్బులు చెల్లించింది. ఒక లక్షా 67 వేల 877 కోట్ల రూపాయాలను వ్యవసాయ రంగానికి రైతుల కోసం వెచ్చించింది. ఇదంతా రెండున్నరేండ్లలోనే చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు.
కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉండదన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్.. కరెంట్ అంటేనే కాంగ్రెస్.. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి చెల్లుతుంది. 1967లో నాగార్జున సాగర్ ప్రారంభిస్తే.. ఈనాటి వరకు కూడా కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్న కూడా ఆరు దశాబ్దాలు చెక్కు చెదరలేదు. అది కాంగ్రెస్ పార్టీ నిబద్దతకు నిదర్శనం. అదే స్థాయిలో శ్రీశైలం బహుళార్థక ప్రాజెక్టు.. 1982లో మొదలుపెడితే 308 టీఎంసీల సామర్థ్యంతో ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. అలాగే జూరాల ప్రాజెక్టు 1981లో మొదలుపెడితే ఈనాటి వరకు కూడా చెక్కు చెదరలేదు. గోదావరి నదిపై ఎస్సారెస్పీ ఇతర ప్రాజెక్టులు నిర్మిస్తే కూడా నేటి వరకు చెక్కు చెదరలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026

CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
జులై 10, 2026
తాజావార్తలు
- ●TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ
- ●CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!
- ●CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
- ●PM Modi | 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌కు భారత ప్రధాని.. మోదీకి ఘన స్వాగతం
- ●CM Revanth Reddy | కల్వకుంట్ల కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

TGSRTC | మీరు బెంగళూరు ప్రయాణికులా.. ఆ బస్సుల్లో మీకు ఫ్రీ జర్నీ

CM Revanth Reddy | కేసీఆర్.. కరెంట్ వైర్ పట్టుకో కాకిలా మాడిమసై పోతావ్ : సీఎం రేవంత్ రెడ్డి

Tollywood | మిరాయ్ బ్యూటీతో మెగా హీరో హారర్ కామెడీ మూవీ - మాస్ పోస్టర్‌తో రిలీజ్ డేట్ చెప్పేశారుగా!

CM Revanth Reddy | భద్రాద్రి రాముడి మీద ఒట్టు.. 117కు సీట్లకు పైగా గెలుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి



