Kajal Aggarwal | ఆ లిమిట్స్ ఎప్పుడూ దాటలేదు – బికినీ , బోల్డ్ సీన్లపై కాజల్ రియాక్షన్
సుదీర్ఘ కెరీర్‌లో కాజల్ ఇప్పటివరకు బికినీ ధరించి ఒక్క సినిమాలో కనిపించలేదు. నో బికినీ రూల్‌పై ది ఇండియా స్టోరీ ప్రమోషన్స్‌లో రియాక్ట్ అయ్యింది అందాల చందమామ. కాజల్ ఏమన్నదంటే?
Entertainment | Published On Jul 10, 2026, 5.06 pm IST
Kajal Aggarwal | రామ్‌చరణ్ పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై దారుణంగా విమర్శలొచ్చాయి. హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ కోసమే అనే సంస్కృతి ఇకనైనా మారాలంటూ చాలా మంది ట్రోల్ చేశారు. ఈ వివాదంపై ది ఇండియా స్టోరీ మూవీ ప్రమోషన్స్‌లో కాజల్ అగర్వాల్ రియాక్ట్ అయ్యింది. సుదీర్ఘ సినీ కెరీర్‌లో తనకు అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయని అన్నది ఈ అందాల చందమామ. "బికినీ ధరించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగే మితిమీరిన రొమాన్స్‌తో కూడిన ఇంటిమేట్ సీన్లు చేయడం కంఫర్ట్‌గా అనిపించదు. ఇష్టం లేని వాటిని చేయకూడదని నాకు నేను రూల్ పెట్టుకున్నా. బికినీ ధరించమని, బోల్డ్ సన్నివేశాల్లో నటించమని చాలా మంది దర్శకులు ఫోర్స్ చేశారు. సినిమానైనా వదులుకుంటా కానీ ఆ సన్నివేశాల్లో నటించనని వారికి ఖరాఖండిగా చెప్పా" అని కాజల్ అన్నది.
లిమిట్స్‌కు లోబడే...
"ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలోనే పాత్రలు, గ్లామర్ పరంగా నాకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకున్నా. వాటికి లోబడే సినిమాలు చేస్తూ వచ్చా. ఆ హద్దులు దాటినట్లు అనిపిస్తే ఎంత పెద్ద బ్యానర్, స్టార్ అన్నది కూడా చూడను. సినిమాను రిజెక్ట్ చేస్తుంటా. అలా వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని పెద్ద హిట్టయ్యాయి కూడా. కానీ అవేవీ నా ఆలోచన విధానాన్ని మార్చలేదు. రిగ్రేట్‌గా ఎప్పుడూ ఫీలవ్వలేదు. నా కంఫర్ట్ నాకు ముఖ్యం. హద్దులు విధించుకోవడం అందరికి మంచిది" అని కాజల్ చెప్పింది.
రిస్క్ తీసుకోలేదు.
"బికినీ, గ్లామర్ సీన్ల వల్ల సినిమాలకు పెద్దగా ఉపయోగంఉండదు. . ఒకసారి వాటిలో నటిస్తే అప్పటివరకు మనపై ఉన్న ఇమేజ్ కూడా మారిపోతుంది. అందుకే ఎప్పుడూ రిస్క్ తీసుకోలేదు" అని కాజల్ పేర్కొన్నది.
ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని మూవీలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీలో గవర్నమెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. అలాగే కాజల్ హీరోయిన్‌గా నటించిన ది ఇండియన్ స్టోరీ మూవీ జూలై 24న థియేటర్లలోకి రాబోతుంది. ఈ బాలీవుడ్ మూవీలో లాయర్ పాత్రను పోషిస్తుంది కాజల్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shalini Pandey | బికినీలో అర్జున్ రెడ్డి హీరోయిన్ – ఇటలీ ట్రిప్ జ్ఞాపకాల్లో…
ఆగస్టు 13, 2026

Janhvi Kapoor | నో గ్లామర్ – అల్లు అర్జున్ రాకాలో గిరిజన రాణిగా జాన్వీకపూర్ – దీపికా, రష్మికలకు ధీటుగా!
ఆగస్టు 13, 2026

Krithi Shetty | కృతిశెట్టి కోసం చెఫ్‌గా మారిన కీర్తి సురేష్ – ఫొటోలు వైరల్
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత



