Netflix | నెట్‌ఫ్లిక్స్ భారీ సర్‌ప్రైజ్.. మళ్లీ ఉచిత ట్రయల్ ప్రారంభం.. 30 రోజులు ఫ్రీ..
Netflix | ప్రముఖ ఓటీటీ, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొత్త వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 30 రోజుల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను ట్రయల్ రూపంలో అందిస్తోంది. దాదాపు 6 సంవత్సరాల తరువాత నెట్ ఫ్లిక్స్ మళ్లీ ట్రయల్ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త యూజర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.
Technology | Published On Jul 10, 2026, 4.52 pm IST
Netflix | ప్రముఖ ఓటీటీ, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ కొత్త వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 30 రోజుల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను ట్రయల్ రూపంలో అందిస్తోంది. దాదాపు 6 సంవత్సరాల తరువాత నెట్ ఫ్లిక్స్ మళ్లీ ట్రయల్ ఫీచర్‌ను అందుబాటులోకి తేవడం విశేషం. నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త యూజర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. గత కొద్ది రోజులుగా యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉందని, అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదని సామాజిక మాధ్యమాల్లో యూజర్లు వెల్లడిస్తున్నారు. కేవలం కొత్త అకౌంట్లను క్రియేట్ చేసిన వారికే ఈ సదుపాయం లభిస్తుందని అంటున్నారు. గతంలో నెట్ ఫ్లిక్స్ కొత్త యూజర్లకు 30 రోజుల పాటు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను అందించింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాట నిజమేనని నెట్‌ఫ్లిక్స్ కు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో వినియోగదారులు 30 రోజుల పాటు ఎలాంటి చార్జీలు లేకుండానే ఓటీటీలో సినిమాలు, వీడియోలు, సిరీస్‌లను వీక్షిస్తూ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.
ఎంపిక చేసిన యూజర్లకు..
నెట్‌ఫ్లిక్స్ హెల్ప్ సెంటర్ ప్రకారం, ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో మాత్రమే కొత్త సభ్యులకు ఉచిత ట్రయల్ అందుబాటులో ఉంది. సైన్-అప్ సమయంలో వినియోగదారుడి అకౌంట్, డివైస్, లొకేషన్ అర్హతలను బట్టి ఈ ఆఫర్ ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. ఒకవేళ ఆఫర్ కనిపించకపోతే, ప్రస్తుతం ఆ అకౌంట్‌కు ట్రయల్ అర్హత లేదని అర్థం. భారత్‌లో ఈ ఉచిత ట్రయల్ ను అధికారికంగా తిరిగి ప్రారంభించామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించకపోయినా, కొత్త ఈ-మెయిల్ అడ్రస్‌తో కొత్త అకౌంట్ సృష్టించే సమయంలో 30 రోజులు సున్నా చార్జీలతో ట్రై చేయండి అనే ఆఫర్ కనిపించినట్లు యూజర్లు చెబుతున్నారు. అలాగే కొందరు వినియోగదారులకు 30 రోజుల ట్రయల్ కనిపిస్తుండగా, మరికొందరికి 15 రోజుల ఉచిత ట్రయల్ మాత్రమే కనిపిస్తోంది. దీంతో వేర్వేరు వినియోగదారులకు వేర్వేరు ప్రమోషన్లను పరీక్షించే ఏ, బీ టెస్టింగ్ విధానాన్ని నెట్‌ఫ్లిక్స్ అమలు చేస్తోందని భావిస్తున్నారు.
దాదాపు 6 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే..
నెట్‌ఫ్లిక్స్ 2020లో ప్రపంచవ్యాప్తంగా 30 రోజుల ఉచిత ట్రయల్ సదుపాయాన్ని నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ ట్రయల్‌ను తీసుకురావడం ద్వారా కొత్త వినియోగదారులను ఆకర్షించి, చెల్లింపు సబ్‌స్క్రిప్షన్ల సంఖ్యను పెంచగలమా అనే అంశాన్ని కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఉచిత ట్రయల్‌కు అర్హులో కాదో తెలుసుకోవాలంటే ముందుగా నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌ను ఓపెన్ చేయాలి. గతంలో ఎప్పుడూ ఉపయోగించని కొత్త ఈ-మెయిల్ అడ్రస్‌తో కొత్త అకౌంట్ సృష్టించాలి. సైన్-అప్ సమయంలో 30 రోజులు సున్నా చార్జీలతో ట్రై చేయండి లేదా 15 రోజుల ఉచిత ట్రయల్ వంటి ఆఫర్ కనిపిస్తే, ట్రయల్ అందుబాటులో ఉన్నట్టే. అనంతరం నచ్చిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకుని, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా మద్దతు ఉన్న యూపీఐ చెల్లింపు విధానాన్ని జోడించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ట్రయల్ వ్యవధిలో ఎలాంటి ఛార్జీలు లేకుండానే వెంటనే స్ట్రీమింగ్ ప్రారంభించవచ్చు.
వద్దనుకుంటే ముందే రద్దు చేయాలి..
అయితే వినియోగదారులు ఒక విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. నెట్‌ఫ్లిక్స్‌లో ఆటోపే డిఫాల్ట్‌గా ప్రారంభమై ఉంటుంది. కాబట్టి ట్రయల్ గడువు ముగిసేలోపు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయకపోతే, యూజర్ ఎంచుకున్న ప్లాన్‌కు సంబంధించిన మొత్తం ఆటోమేటిక్‌గా చెల్లింపు విధానం నుంచి వసూలు చేస్తారు. అందువల్ల 30 రోజులకు ముందే ఆ విషయంపై అవగాహనకు రావాలి. ఒక వేళ సబ్‌స్క్రిప్షన్ ను కొనసాగిస్తే ఏం చేయాల్సిన పనిలేదు. తేదీ నాడు ఆటోమేటిక్‌గా చార్జీలను వసూలు చేస్తారు. అయితే సబ్‌స్క్రిప్షన్ వద్దనుకుంటే మాత్రం 30 రోజులకు ముందే క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆఫర్ ను ఎప్పటివరకు అందుబాటులో ఉంచుతారు అన్న విషయంపై కూడా నెట్‌ప్లిక్స్ స్పష్టతను ఇవ్వలేదు.
సంబంధిత వార్తలు

Peddi OTT | ఓటీటీలో రామ్‌చరణ్ పెద్ది స్ట్రీమింగ్ – లిప్‌లాక్‌లలో నో ఛేంజెస్ – కొత్తగా యాడ్ చేసిన సీన్లు ఏవంటే?
జులై 9, 2026

Peddi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి పెద్ది – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
జులై 4, 2026

ACT Fibernet | యాక్ట్ ఫైబర్‌నెట్ కొత్త స్ట్రీమ్ టీవీ 4కే డివైస్.. ఏఐతో కంటెంట్‌ను ఈజీగా వెదకవచ్చు..
జులై 1, 2026
తాజావార్తలు
- ●E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం
- ●Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
- ●WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
- ●Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?
- ●Sridhar Babu | తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేలా చూడండి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఒక్క రోజులోనే రూ.6 లక్షల కోట్లు లాభం..

E20 fuel | ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజ్ 5 శాతం తగ్గొచ్చు.. అంగీకరించిన కేంద్రం

Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..

Sreeleela | సోషల్ మీడియాలో శ్రీలీల రేంజ్ మామూలుగా లేదుగా.. ఒక్కో ఇన్‌స్టా పోస్ట్‌కు ఎంత డిమాండ్ చేస్తుందంటే?



