Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మన శంకర వరప్రసాద్‌గారు బ్లాక్‌బస్టర్ తర్వాత మరో కొత్త మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చారు మెగాస్టర్ చిరంజీవి. మెగా 158 మూవీ గురువారం హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాప్‌తో చిరంజీవి సినిమా ప్రారంభమైంది.
Entertainment | Published On May 21, 2026, 10.29 am IST
Mega 158 | మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మెగా 158 మూవీ గురువారం హైదరాబాద్‌లో లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. చిరంజీవిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ నిచ్చారు. మెగా 158 ఓపెనింగ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నాగబాబు, సుస్మిత కొణిదెల, వీవీ వినాయక్‌తో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా....
చిరంజీవి, బాబీ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కీలక పాత్రలో కనిపించబోతున్నది. మెగా 158 ప్రారంభోత్సవ వేడుకలో అనస్వర రాజన్ పాల్గొన్నది. ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా అనస్వర రాజన్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మలయాళ టాప్ హీరో....
చిరంజీవి, బాబీ మూవీలో మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. చిరంజీవి, మోహన్ లాల్ కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. చిరంజీవికి జోడీగా ప్రియమణి నటిస్తోన్న ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, బండ్ల గణేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
తమన్ మ్యూజిక్...
మెగా 158 మూవీని సాండల్‌వుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తెలుగులో కేవీఎన్ సంస్థ తెరకెక్కిస్తోన్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మే 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో ఇది సెకండ్ మూవీ. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వాల్తేర్ వీరయ్య బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | సద్దుల బతుకమ్మ సంబరాల్లో విరోష్ జోడీ – రష్మికకు డిప్యూటీ సీఎం దంపతుల కానుక
అక్టోబర్ 17, 2026

Vijay Deverakonda | అఫీషియల్ – “మనం” డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా – జానర్ ఇదే
అక్టోబర్ 16, 2026

Ranabaali Review | రణబాలి రివ్యూ … విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం
- ●FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!
- ●Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...
- ●ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..
- ●Traffic Advisory | సద్దుల బతుకమ్మ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●Vijay - Rashmika | బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో విజయ్, రష్మిక

Navaratri Brahmotsavams | తిరుమలలో గజవాహనంపై మలయప్పస్వామి దివ్యదర్శనం

FSSAI | నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్‌కు FSSAI నోటీసులు!

Ajay Devgn | అజయ్ దేవ్‌గణ్ నివాసంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్...

ACB Raids | కీసర ఇన్స్పెక్టర్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. రూ.2.28 కోట్ల ఆస్తులు గుర్తింపు..



