Tummala Nageshwar Rao | రైతు భరోసా పథకం కింద 30 నెలల్లోనే.. రూ. 36 వేల కోట్లు జమ : మంత్రి తుమ్మల
Tummala Nageshwar Rao | ప్రజా ప్రభుత్వంలో రైతులకు, వ్యవసాయ రంగానికి అండగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.
Tummala Nageshwar Rao | త్రినేత్ర.న్యూస్ : ప్రజా ప్రభుత్వంలో రైతులకు, వ్యవసాయ రంగానికి అండగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం కింద గత 30 మాసాల పరిపాలనలో.. ఈ కాలంలోనే 36 వేల కోట్లు కేవలం రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో జమ చేసిన ఏకైక ప్రభుత్వం.. భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో మంత్రి తుమ్మల పాల్గొని ప్రసంగించారు.
గత పదేండ్ల తెలంగాణ ప్రభుత్వ కాలంలో 72 వేల కోట్లు వేస్తే కేవలం ప్రజా పాలనలో 30 మాసాల్లోనే 36 వేల కోట్లు జమ చేశాం. వ్యవసాయ రంగానికి సహకరిస్తున్నాం. ఆర్థికంగా విధ్వంసమైన రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే గుండె ధైర్యంతో కష్టాలు ఉన్న ఇబ్బందులు, సమస్యలు ఉన్నా సాగుకు సహకరించాలని మొండి పట్టుదలతో ముందుకు పోతున్న ఏకైక ప్రభుత్వం మాది. గత రెండున్నరేండ్లలో అత్యధిక దిగుబడి సాధించాం. ఈ ఏడాది రెండు పంటలకు కలిపి 2 కోట్ల 83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి అగ్రగామిగా నిలిచాం. ఎంఎస్పీ ధరలు ప్రకంటించినప్పటికీ కేంద్రం సహకరించట్లేదు.. అన్ని పంటలను కొనుగోలు చేసిన ఏకైక ప్రభుత్వం మాది. 3,720 కోట్ల మొక్కజొన్న రైతుల ఖాతాల్లో ఇవాళ జమ చేస్తున్నాం. జొన్నలు, సోయా, సన్ ఫ్లవర్ ఎంఎస్సీకి కొనుగోలు చేశాం. కేంద్రం చేతులెత్తేసింది. సీఎం ఆదేశాలకు అనుగుణంగా అన్ని పంటలు కొనుగోలు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు.
నెల పదిహేను రోజుల్లో సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు
ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి లక్షలాది మంది రైతులు తరలివచ్చారు. నెల పదిహేను రోజుల్లో సత్తుపల్లి ప్రాంతానికి గోదావరి జలాలు పారిస్తాం. కృష్ణా నదిలో ఉన్న ఇబ్బందులు భవిష్యత్‌లో ఇంకా తీవ్రమవుతాయి. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. పాలేరు నింపుతాం. ఈ జిల్లాకు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరిస్తున్నాం. జిల్లా ప్రజల ఆశలకు అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఖమ్మం జిల్లా రేవంత్ సర్కార్‌కు అండగా ఉండాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను అని తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!

BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత

BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్





