Anil Ravipudi | దగ్గుబాటి, నందమూరి హీరోలతో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ – టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్
మన శంకర వరప్రసాద్‌గారు తర్వాత మరో దగ్గుబాటి, నందమూరి హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ మల్టీస్టారర్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
Entertainment | Published On Feb 27, 2026, 10.22 am IST
Anil Ravipudi | మన శంకర వరప్రసాద్‌గారుతో సంక్రాంతికి పెద్ద హిట్టు అందుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్ తొలిసారి కలిసి నటించిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 350 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. కొణిదెల, దగ్గుబాటి హీరోల తర్వాత మరో ఇంట్రెస్టింగ్ మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నారు అనిల్ రావిపూడి. ఈ సారి దగ్గుబాటి హీరోతో పాటు నందమూరి కథానాయకుడిని లైన్‌లో పెట్టారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి అఫీషియల్‌గా ప్రకటించారు.
పటాస్‌తోనే డెబ్యూ...
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్‌తోనే డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి జర్నీ మొదలైంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ డెబ్యూ హీరోతో ఈ సినిమా చేయబోతున్నాడు. ఇక అనిల్ రావిపూడికి అచ్చొచ్చిన హీరోగా వెంకటేష్ నిలిచారు. వీరిద్దరు కలిసి ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ మల్టీస్టారర్‌తో ఐదోసారి వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
వారసులు హీరోలుగా...
దగ్గుబాటి నందమూరి హీరోల కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. గతంలో బాలకృష్ణ, వెంకటేష్‌తో పాటు...వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమాలు చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు సినిమాల్లో రానా ఓ కీలక పాత్రలో నటించారు. ఈ రెండు ఫ్యామిలీస్‌కు చెందిన వారసులు హీరోలుగా ఓ సినిమా రూపొందనుండటం టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి అని ఫ్యాన్స్ చెబుతోన్నారు.
స్క్రిప్ట్ పనులు ఎండింగ్...
వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తుది దశకు చేరుకున్నట్లు వెల్లడించారు. త్వరలోనే టైటిల్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించబోతున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఆదర్శకుటుంబం సినిమా చేస్తున్నారు వెంకటేష్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అనిల్ రావిపూడి మూవీ సెట్స్‌లో వెంకటేష్ అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Anil Ravipudi | కళ్యాణ్ రామ్ బర్త్‌డే.. ఫస్ట్‌లుక్‌తో అనిల్ రావిపూడి సర్ప్రైజ్
జులై 5, 2026

Tollywood | గ్రాండ్‌గా డైరెక్టర్ మెహర్ రమేష్ కూతురి పెళ్లి – హాజరైన పవన్ కళ్యాణ్, చిరంజీవి
జులై 2, 2026

Venkatesh | అఫీషియల్ : వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శకుటుంబం రిలీజ్ డేట్ ఫిక్స్ – పోస్ట్‌పోన్ రూమర్లకు చెక్
జూన్ 27, 2026
తాజావార్తలు
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్



