Suryakumar Yadav | వీడియో అనలిస్టు సూచనలు బాగా పనిచేశాయి: సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో గురువారం జింబాబ్వేతో చెన్నైలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత జట్టు 72 పరుగుల తేడాతో గెలుపొందింది.
Suryakumar Yadav | టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో గురువారం జింబాబ్వేతో చెన్నైలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత జట్టు 72 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఓటమి అనంతరం తమ తప్పులను తాము తెలుసుకున్నామని అన్నాడు. బ్యాటర్లు ఎందుకు విఫలం అయ్యారన్న విషయంపై తమ వీడియో అనలిస్టు విశ్లేషణ చేశారని చెప్పాడు. అందువల్లే ఆ తప్పులను మళ్లీ చేయకుండా జింబాబ్వేపై విజయం సాధించామని స్పష్టం చేశాడు. ప్రతి బ్యాటర్, బౌలర్ ఏయే విషయాల్లో తప్పులు చేస్తున్నారో వీడియో అనలిస్టు వివరించారని, జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆ వివరాలు తమకు ఎంతో దోహదం చేశాయని సూర్య తెలిపాడు.
మ్యాచ్ విన్ అయ్యామా, లేదా అన్నదే ముఖ్యం..
టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు అందరూ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేశారని సూర్య కితాబిచ్చాడు. అయితే బౌలింగ్ విషయంలో ఇంకాస్త మెరుగ్గా రాణించాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ మ్యాచ్ ముగిశాక విన్ అయ్యామా లేదా అన్నదే ముఖ్యమని, ఆ విజయంతోనే తాము ముందుకు సాగుతామని తెలిపాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు ముందు జట్టులో ఉన్న లోపాలను పూర్తిగా సరిచేసుకుని మళ్లీ ఇంకా రెట్టించిన ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగుతామని అన్నాడు. జింబాబ్వే బ్యాటర్లు అద్భుతంగా ఆడారని, పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పాడు.
నెగెటివ్‌లోనే రన్ రేట్..
కాగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేయగా, జింబాబ్వే 6 వికెట్లను కోల్పోయి 184 పరుగులు చేసింది. 72 పరుగుల భారీ తేడాతో భారత్ విజయం సాధించినప్పటికీ ఇంకా ఎక్కువ తేడా సాధించి ఉంటే బాగుండేదని, ఆ అవకాశం ఉన్నా కూడా బౌలర్లు చివరి ఓవర్లలో సరిగ్గా బౌలింగ్ వేయలేదని, దీంతో రన్ రేట్ పాజిటివ్‌లోకి వచ్చేది కాస్తా ఇంకా నెగెటివ్‌లోనే ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇద్దరూ ఒక్కో వికెట్ చొప్పున తీసి ఫర్వాలేదనిపించినా శివం దూబె కేవలం 2 ఓవర్లే వేసి 46 పరుగులు సమర్పించుకోవడం, అందులో అనేక నో బాల్స్ ఉండడం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సైతం ఓ దశలో తీవ్ర అసహనానికి గురి చేసింది. దీనిపైనే విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. ఇక భారత్ తన తదుపరి సూపర్ 8 మ్యాచ్‌ను మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సెమీ ఫైనల్‌కు చేరనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!
- ●Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

Black-crowned night heron | బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కులో అరుదైన పక్షి.. మీరు ఓ కన్నేయండి..!

Horoscope | జూలై 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి తోబుట్టువులతో సమస్యలు.. జర జాగ్రత్త..!

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్






