LPG Price Hike | యుద్ధం ఎఫెక్ట్!.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు..
LPG Price Hike | మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్‌పైనా చూపుతున్నది. దేశీయ ఎల్పీజీ (LPG) అవసరాల్లో సుమారు 80 నుంచి 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటం, అందులోనూ మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుండటంతో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నది.
LPG Price Hike | త్రినేత్ర.న్యూస్: మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్‌పైనా చూపుతున్నది. దేశీయ ఎల్పీజీ (LPG) అవసరాల్లో సుమారు 80 నుంచి 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటం, అందులోనూ మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తుండటంతో గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ వ్యవధిని పెంచిన దేశీయ చమురు కంపెనీలు.. తాజాగా సిలిండర్ ధరలను (LPG Price Hike) కూడా భారీగా పెంచాయి.
గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.60, కమర్షియల్ సిలిండర్‌పై రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.965కి చేరింది. ఇక ఢిల్లీలో రూ.913, ముంబైలో రూ.912.50, కోల్‌కతాలో రూ.930, చెన్నైలో రూ.928.50కు పెరిగాయి.
అదేవిధంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1883గా ఉండగా, ముంబైలో రూ.1835, కోల్‌కతాలో రూ.1990, చెన్నైలో రూ.2043.50గా ఉన్నాయి. కాగా, కమర్షియల్ సిలిండర్ ధరల్లో ప్రతినెలా మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ, గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర 2025 ఏప్రిల్ తర్వాత పెరగడం ఇదే తొలిసారి. గతేడాది మాచ్చిలో ఈ ధర రూ.905గా ఉన్నది. అయితే ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలోనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఎల్పీజీ ఉత్పత్తి పెంచండి
పశి్చమాసియాలో (Middle East war) సంక్షోభం నేపథ్యలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం(ఎస్మా) ఈ ఆదేశాలు జారీ చేసింది. ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వం రంగ చమురు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టంచేసింది. వాటితో కేవలం ఎల్పీజీని మాత్రమే ఉత్పత్తి చేయాలని తేల్చిచెప్పింది.
ఎల్పీజీని దేశీయంగా వంట అవసరాలకు మాత్రమే వాడుకోవాలని వెల్లడించిది. ఆదేశాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 2024–25లో దేశంలో 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉపయోగించారు. ఇందులో 12.8 మిలియన్ టన్నులను దేశీయంగా ఉత్పత్తి చేయగా, మిగతా గ్యాస్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. దాదాపు 90 శాతం ఎల్పీజీ గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఇరాన్ సహా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సహా ఎల్పీజీ దిగుమతుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఇవికూడా చదవండి..
గ్యాస్ సరఫరాపై యుద్ధ ప్రభావం.. భారత్‌లో 30 రోజులకు సరిపడా మాత్రమే ఎల్పీజీ నిల్వలు..!
యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి..? పెరుగుతాయా..?
తాజావార్తలు
- ●Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?
- ●Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..
- ●Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి
- ●Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!
- ●EPFO | ఈపీఎఫ్‌వో పాస్‌బుక్ పోర్టల్ మళ్లీ అందుబాటులోకి.. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేయండి..
- ●Rukmini Vasanth | క్రేజీ కాంబో సెట్ - నితిన్‌కు జోడీగా డ్రాగన్ బ్యూటీ - ప్రొడ్యూసర్‌గా హీరో నాని

Naga Durga | నాగదుర్గ తెలుగు మూవీ షూటింగ్ షురూ - ఇడుపు కాయితం రిలీజ్ డేట్ ఇదేనా ?

Meta | మెటా యూటర్న్.. ప్రైవసీ విమర్శలతో ఏఐ ఇమేజ్ ఫీచర్‌కు గుడ్‌బై..

Anesthesia | పెదవి గాయానికి చికిత్స.. మత్తు ఇంజక్షన్ కారణంగా 18 నెలల చిన్నారి మృతి

Spain vs Belgium | 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. బెల్జియంను మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్పెయిన్!






