Petrol And Diesel Prices | యుద్ధం ఎఫెక్ట్.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి..? పెరుగుతాయా..?
Petrol And Diesel Prices | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చనే ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అలాగే ఇరాన్ ఆ ప్రాంతంలో కఠిన నియంత్రణలు అమలు చేయడం వల్ల ఈ భయాలు మరింత పెరిగాయి.
Petrol And Diesel Prices | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవచ్చనే ఆందోళనలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, అలాగే ఇరాన్ ఆ ప్రాంతంలో కఠిన నియంత్రణలు అమలు చేయడం వల్ల ఈ భయాలు మరింత పెరిగాయి. అయితే ఈ పరిస్థితుల మధ్య కూడా భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం తక్షణ కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోవని తెలుస్తోంది. పీటీఐ నివేదిక ప్రకారం అంతర్జాతీయ మార్కెట్‌లో సంక్షోభ పరిస్థితులు ఏర్పడినప్పటికీ ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఒక సమతుల్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీర్ఘకాలం యుద్ధం ఉంటే కష్టమే..
ఈ విధానంలో భాగంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్న సమయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు లాభ మార్జిన్ పెరిగేలా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. తద్వారా తరువాత ధరలు పెరిగినప్పుడు ఆ కంపెనీలు కొంతవరకు ఆ భారం భరించి వినియోగదారులపై ప్రభావం పడకుండా చూడగలుగుతాయి. నోమురా నివేదిక ప్రకారం గతంలో క్రూడ్ ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలకు ఒక బఫర్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ ధరలు పెరిగినా వాటిని కొంతవరకు ఎదుర్కొనే సామర్థ్యం కంపెనీలకు వచ్చింది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల అస్థిరత దీర్ఘకాలం కొనసాగితే భవిష్యత్తులో ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
ఏయే నగరాల్లో ఎలా..
దేశంలోని కొన్ని నగరాల్లో ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా, మరికొన్ని నగరాల్లో తక్కువగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం రాష్ట్రాల వారీగా విధించే పన్నుల వ్యత్యాసమే. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.77 ఉండగా, డీజిల్ ధర రూ.87.67గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.103.54, డీజిల్ రూ.90.03, కోల్‌కతాలో పెట్రోల్ రూ.105.45, డీజిల్ రూ.92.02, చెన్నైలో పెట్రోల్ రూ. 100.84, డీజిల్ రూ. 92.39, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 107.46, డీజిల్ రూ. 95.70, బెంగళూరులో పెట్రోల్ రూ. 102.96, డీజిల్ రూ. 90.99గా ఉన్నాయి.
అయితే మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్‌పై కనిపిస్తున్నప్పటికీ తక్షణ కాలంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశం ఉందని, ఇంధన ధరలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి
- ●Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!
- ●Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు
- ●Shabad on fire | భగ్గుమన్న షాబాద్.. పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
- ●Yadagirigutta Temple Board | కొలువుదీరిన యాదగిరిగుట్ట కొత్త బోర్డు

CM Revanth Reddy | మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో తీవ్ర లోపాలు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఈటల రాజేందర్‌ను గౌరవించే పరిస్థితి ఇప్పుడు లేదు : సీఎం రేవంత్ రెడ్డి

Mojtaba Khamenei Revenge | నా తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటా..!

Bollywood | మైనర్‌కు వేధింపులు - ప్రముఖ నటుడిపై పోక్సో కేసు






