BPCL | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రూ.5వేల కోట్లకు బీపీసీఎల్ డిబెంచర్లు..
BPCL | భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ.5వేల కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీకి ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా జరిగిన బీపీసీఎల్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
BPCL | భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) రూ.5వేల కోట్ల వరకు నిధులను సమీకరించేందుకు నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ల జారీకి ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా జరిగిన బీపీసీఎల్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. సెక్యూర్డ్ లేదా అన్‌సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సిరీస్‌లు లేదా విడతల్లో జారీ చేయనుంది. గరిష్ఠంగా 10 విడతల్లో, మొత్తం రూ.5వేల కోట్లకు మించకుండా, ఏడాది కాలంలో ఈ నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రతి సిరీస్ లేదా విడతకు సంబంధించిన కేటాయింపు వివరాలు, ఇతర అంశాలను ఆయా డిబెంచర్ల జారీ సమయంలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు అవసరమైన విధానంలో వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.
భారీగా నష్టాలు నమోదు..
నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు స్థిర ఆదాయాన్ని అందించే రుణ సాధనాలు. కంపెనీలు దీర్ఘకాలిక నిధుల సమీకరణ కోసం వీటిని ఉపయోగిస్తాయి. సాధారణంగా అన్‌సెక్యూర్డ్ నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లు ఆస్తుల ద్వారా సెక్యూర్‌గా ఉండవు. అందువల్ల పెట్టుబడిదారులు డిబెంచర్లను జారీ చేసే కంపెనీ క్రెడిట్ సామర్థ్యం, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిశీలిస్తారు. పెట్టుబడిదారులు నిర్ణీత కాల వ్యవధికి నిర్ణీత వడ్డీ రేటుకు కంపెనీకి డబ్బును అప్పుగా ఇస్తారు. కన్వర్టిబుల్ డిబెంచర్లకు భిన్నంగా నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్లను కంపెనీ ఈక్విటీ షేర్లుగా మార్చుకునే అవకాశం ఉండదు. బీపీసీఎల్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,962 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ రూ.3,919 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
క్షీణించిన షేర్ ధర..
అయితే బ్లూమ్‌బర్గ్ అంచనా వేసిన రూ.12,632 కోట్ల నష్టంతో పోలిస్తే బీపీసీఎల్ నమోదు చేసిన నష్టం గణనీయంగా తక్కువగా ఉంది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 18.2 శాతం పెరిగి రూ.1.51 లక్షల కోట్లకు చేరింది. అంతకుముందు త్రైమాసికంలో ఆదాయం రూ.1.91 లక్షల కోట్లుగా ఉంది. సమీక్షా త్రైమాసికంలో ఎబిట్డా నష్టం రూ.4,077 కోట్లుగా నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో ఈ నష్టం రూ.10,061 కోట్లుగా ఉంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ షేర్ ధర గత సెషన్‌లో ట్రేడింగ్ ముగిసే సమయానికి 2.01 శాతం పడిపోయి రూ.310.30 వద్ద స్థిరపడింది. అయితే ఇదే సమయంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 సూచీ 0.55 శాతం క్షీణించింది.
తాజావార్తలు
- ●Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం
- ●Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్
- ●Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్
- ●Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్
- ●TG Weather | తెలంగాణకు ఐఎండీ తీపి కబురు.. మళ్లీ జోరందుకోనున్న వానలు..!
- ●Kayadu Lohar | రెట్రో లుక్‌లో కయదు - క్యూట్ ఫాటోలతో మాయ చేసిన ప్యారడైజ్ హీరోయిన్

Chintala Ramachandra Reddy | "ఉపఎన్నిక కోసం కొట్లాడింది మేము.. గెలిచేదీ మేమే": విజయా రెడ్డి పిటిషన్లో ఇంప్లీడ్ అవుతాం

Sanjay Malhotra | ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సవాళ్లు.. అప్రమత్తతే కీలకం: ఆర్బీఐ గవర్నర్

Bollywood Debut | అడవి నుంచి కెమెరా ముందుకు..! మాజీ మహిళా మావోయిస్టులకు బాలీవుడ్ ఛాన్స్

Parliamentary Committee on Defence 2026 | పార్లమెంట్ రక్షణ కమిటీ పునర్వ్యవస్థీకరణ: తెలంగాణ నుంచి దామోదర్ రావు, ఏపీ నుంచి కేశినేని చిన్నికి చోటు.. చైర్మన్‌గా రాధా మోహన్ సింగ్






