Evening BTech Courses | వారం రోజుల్లో ‘ఈవినింగ్ బీటెక్ కోర్సు’లకు నోటిఫికేషన్.. వివరాలివే..!
Evening BTech Courses | పాలిటెక్నిక్( Polytechnic ) పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంలో నిమగ్నమవుతున్న అభ్యర్థులు.. ఇక నుంచి తమ ఉన్నత విద్యను కొనసాగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
Evening BTech Courses | త్రినేత్ర.న్యూస్ : పాలిటెక్నిక్( Polytechnic ) పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంలో నిమగ్నమవుతున్న అభ్యర్థులు.. ఇక నుంచి తమ ఉన్నత విద్యను కొనసాగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని 12 ఇంజినీరింగ్ కాలేజీల్లో సాయంత్రం బీటెక్ కోర్సులకు( Evening B Tech Courses ) అనుమతి ఇచ్చింది.
అయితే ఈ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఉస్మానియా వర్సిటీ వీసీ కుమార్ శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో 12 ప్రైవేట్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను నడుపుకొనేందుకు ప్రభుత్వం మార్చిలో జీఓ 30 జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈవెనింగ్ బీటెక్ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేస్తామన్నారు. పాలిటెక్నిక్ పూర్తయిన వారు రెండేళ్ల అనుభవం తర్వాత ప్రవేశ పరీక్ష రాసి నేరుగా బీటెక్ లేదా బీఫార్మసీ రెండో ఏడాదిలో చేరవచ్చని తెలిపారు. ప్రైవేట్ కళాశాలలతోపాటు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో కూడా పార్ట్‌టైమ్ బీటెక్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు.
ఒక్కో కోర్సుకు 15 నుంచి 60 సీట్లు
మొత్తం 12 కాలేజీల్లో ఒక్కో కాలేజీకి ఒకట్నుంచి ఐదు కోర్సులకు అనుమతి లభించింది. ఒక్కో కోర్సులో కనిష్ఠంగా 15 నుంచి గరిష్ఠంగా 60 సీట్ల వరకు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం. అయితే ఈ 12 కాలేజీలు కలిసి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించుకుని ఆయా కోర్సుల్లో ఆసక్తి కలిగిన అభ్యర్థులను చేర్చుకోవచ్చు.
మరి అర్హతలు ఏంటి..?
పాలిటెక్నిక్ పూర్తి చేసి.. కనీసం ఏడాది పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు బీటెక్ కోర్సులో చేరొచ్చు. బీటెక్ చేసిన వారు ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. సాయంత్రం వేళ తరగతులు ఉంటాయి. రెగ్యులర్ కోర్సులకు ఉన్న ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అనుమతి పొందిన కాలేజీలు ఇవే..
1.సీబీఐటీ
2.వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి
3.ఎంవీఎస్‌ఆర్
4.స్టాన్లీ
5.మెథడిస్ట్
6.ఎంజీఐటీ
7.మాతృశ్రీ
8.అబ్దుల్ కలాం
9.జయప్రకాశ్ నారాయణ్(మహబూబ్‌నగర్)
10.అనుబోస్(పాల్వంచ)
11.సిద్ధార్థ
12.సెయింట్ పీటర్స్
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ




