Congress | మీ కోసం మా సీటు త్యాగం చేశాం.. అయినా?.. శరద్‌పవార్‌పై కాంగ్రెస్ అసంతృప్తి
Congress | కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నిర్ణయించడంపై కాంగ్రెస్ (Congress) పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను (Sharad Pawar) మరోసారి రాజ్యసభకు పంపేందుకు తమ పార్టీకి దక్కాల్సిన సీటును త్యాగం చేశామని, అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం సరికాదని విమర్శించింది.
Congress | త్రినేత్ర న్యూస్: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) నిర్ణయించడంపై కాంగ్రెస్ (Congress) పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను (Sharad Pawar) మరోసారి రాజ్యసభకు పంపేందుకు తమ పార్టీకి దక్కాల్సిన సీటును త్యాగం చేశామని, అయినప్పటికీ ఇప్పుడు ఆయన బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపడం సరికాదని విమర్శించింది. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించింది. గత మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో శరద్ పవార్‌ను కోసం మహారాష్ట్ర కాంగ్రెస్ తన సీటును (Rajya Sabha seat) వదులుకున్నామని, దానిని అప్పుడే మర్చిపోయారా అంటూ మండిపడింది.
ఈనెల 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసందర్భంగా మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు డీలిమిటేషన్ బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 1న సాయంత్రం ఈ రెండు బిల్లులపై ఓటింగ్ జరుగనున్నట్లు జాతయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు శరద్ పవార్, సుప్రియా సూలే నేతృత్వంలోని NCP(SP)మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
2026 మార్చిలో మహారాష్ట్రలోని 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఎన్సీపీ (ఎస్పీ) వద్ద కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని కాంగ్రెస్ గుర్తుచేసింది. ఒక అభ్యర్థి గెలవడానికి 36 ఓట్లు అవసరం కాగా, కాంగ్రెస్‌కు 16 మంది, శివసేన (యూబీటీ)కి 20 మంది ఎమ్మెల్యేల బలం ఉందని పేర్కొంది. సుప్రియా సూలే (Supriya Sule) స్వయంగా కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి తన తండ్రి అభ్యర్థిత్వానికి మద్దతు కోరారని గుర్తుచేసింది. 85 ఏండ్ల వయసులో ఉన్న శరద్ పవార్‌ను తిరిగి రాజ్యసభకు పంపేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi), మల్లికార్జున ఖర్గే ఏమాత్రం సంకోచించకుండా తమ పార్టీ సీటును వదులుకున్నారని పేర్కొంది.
కాగా, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, అందుకే తమ పార్టీ దానికి మద్దతు ఇస్తున్నదని ఎన్సీపీ (ఎస్పీ) నేత జితేంద్ర అవద్ స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇంకా తుది అధికారిక నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) నివాసంలో జరుగనున్న ఇండియా కూటమి (INDIA bloc) సమావేశానికి తాము హాజరు కావడం లేదని ఆ పార్టీ ప్రకటించింది.
शरद पवार साहेबांना वयाच्या ८५व्या वर्षी पुन्हा राज्यसभेवर पाठवण्यासाठी काँग्रेस पक्ष शेवटपर्यंत त्यांच्या पाठीशी ठामपणे उभा राहिला होता…
मार्च २०२६ मध्ये महाराष्ट्रातील राज्यसभेच्या ७ जागांसाठी निवडणूक होणार होती. राष्ट्रवादी काँग्रेस (शरदचंद्र पवार) पक्षाकडे अवघे १० आमदार होते. एका उमेदवाराला निवडून येण्यासाठी ३६ मतांची आवश्यकता होती. काँग्रेसकडे १६, तर शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) पक्षाकडे २० आमदार होते.
सुप्रिया सुळे यांनी शरद पवार साहेबांच्या उमेदवारीसाठी काँग्रेस नेतृत्वाकडे पाठिंबा मागितला. राहुल गांधी आणि मल्लिकार्जुन खरगे यांनी कोणतेही आढे वेढे न घेता सकारात्मक भूमिका घेतली. काँग्रेसने स्वतःच्या जागेवरील दावा बाजूला ठेवत शरद पवार साहेबांच्या उमेदवारीला पाठिंबा दिला. त्यानंतर शिवसेना (उद्धव बाळासाहेब ठाकरे) पक्षानेही त्यांना पाठिंबा दिला आणि महाविकास आघाडीने एकमताने त्यांची उमेदवारी निश्चित केली.
आणि आता काय?
परिसीमन कायद्याच्या पार्श्वभूमीवर तेच शरद पवार साहेब, सुप्रीया सुळे ताई आणि त्यांचा राष्ट्रवादी काँग्रेस (शरदचंद्र पवार) पक्ष भाजप सरकारला पाठिंबा देणार आहेत.
— Maharashtra Congress (@INCMaharashtra) November 27, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Skip Toll | వాహనదారులూ జాగ్రత్త.. నంబర్ ప్లేట్ దాచి టోల్ ఎగ్గొట్టాలని చూస్తే 6 రెట్లు కట్టాల్సిందే!
- ●Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..
- ●DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..
- ●Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!
- ●M Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక పాలసీ..
- ●MLC Dasoju | ‘హీరోస్ ఆఫ్ హైదరాబాద్’ అవార్డులు ప్రదానం చేసిన ఎమ్మెల్సీ దాసోజు

Skip Toll | వాహనదారులూ జాగ్రత్త.. నంబర్ ప్లేట్ దాచి టోల్ ఎగ్గొట్టాలని చూస్తే 6 రెట్లు కట్టాల్సిందే!

Hyderabad Metro | పదో వసంతంలోకి హైదరాబాద్ మెట్రో రైలు..

DEPwD | హైదరాబాద్ దివ్యాంగుల శాఖలో 83 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే..

Horoscope | నవంబర్ 28 రాశిఫలాలు.. కుటుంబ సభ్యులతో అపార్థాలు రావచ్చు!






