Thread Pochampally | హైటెక్స్ వేదికగా.. జూన్ 5 నుంచి 7 వరకు పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్..!
Thread Pochampally | త్రినేత్ర.న్యూస్ : చేనేత మగ్గాలపై నేసిన సాంప్రదాయ కళాఖండాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత వస్త్రాలు ఇప్పుడు నగర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Thread Pochampally | త్రినేత్ర.న్యూస్ : చేనేత మగ్గాలపై నేసిన సాంప్రదాయ కళాఖండాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత వస్త్రాలు ఇప్పుడు నగర ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ హైటెక్స్‌లో ‘త్రెడ్ పోచంపల్లి’ పేరుతో జూన్ 5 నుంచి 7 వరకు ప్రత్యేక ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. చేతివృత్తుల గొప్పతనాన్ని పరిచయం చేయడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
జూన్ 5వ తేదీన రాష్ట్ర చేనేత, జౌళిశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ఎగ్జిబిషన్‌లో పోచంపల్లికి చెందిన 100 స్టాల్స్, అనుబంధంగా శ్రీశక్తి సంఘాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
అంతేకాకుండా, సంప్రదాయ మగ్గాలపై ప్రత్యక్ష ప్రదర్శనలు, పోచంపల్లి శైలికి గుర్తింపు తెచ్చిన క్లిష్టమైన టై అండ్ డై పద్ధతిలో నూలు రంగుల అల్లిక ప్రక్రియ, చేతి వృత్తుల వెనుక ఉన్న కళాత్మక నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి ప్రాంతానికి చెందిన స్థానిక వంటకాలను కూడా ప్రత్యేకంగా అందుబాటులో ఉంచనున్నారు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..
- ●CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్
- ●HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం
- ●Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
- ●Ganesh Festival | గణేష్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
- ●Harish Rao | జీవో 97 రద్దు చేయకపోతే.. లక్ష మందితో సచివాలయం ముట్టడి

Toxic | 'టాక్సిక్' సినిమా చూడండి.. కానీ ఆ దృశ్యాలను చిత్రీకరించకండి..

CM Revanth Reddy | గాయత్రి గోపీచంద్, ట్రీసా జాలీలను అభినందించిన సీఎం రేవంత్

HYDRAA | విద్యార్థుల భద్రతే ముఖ్యం.. ఫేక్ ఫైర్ ఎన్వోసీలపై కాలేజీలకు హైడ్రా దిశానిర్దేశం

Irrigation Projects | భూసేకరణకు రూ.6 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ



