Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం.. మంత్రివర్గ విస్తరణ వేళ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా
Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్‌లో (Karnataka Congress) మరోసారి ముసలం స్టార్ట్ అయ్యింది. కేబినెట్ విస్తరణ వేళ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
- కాంగ్రెస్‌లో మాజీ సీఎంల పిల్లలకే ప్రాధాన్యత అంటూ ఆరోపణ
- ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేబినెట్ విస్తరణ
- మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న 20 మంది ఎమ్మెల్యేలు
Karnataka Congress | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress)లో అసమ్మతి జ్వాలలు కొనసాగుతున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న డీకే శివకుమార్‌కు (DK Shivakumar) నేతల తీరు తలనొప్పిగా మారింది. మొన్నటికి మొన్న కేబినెట్ పోర్ట్‌ఫోలియోల (Portfolio) కేటాయింపులపై పలువురు సీనియర్ మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేబినెట్ విస్తరణ (Karnataka Cabinet expansion)సందర్భంగా మరోసారి కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం స్టార్ట్ అయ్యింది.
ఇవాళ కర్ణాటక మంత్రివర్గం విస్తరణ ఉన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ హైకమాండ్ 20 మంది ఎమ్మెల్యేలతో కూడిన తుది జాబితాను ఖరారు చేసింది. ఇవాళ సాయంత్రం వారంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా చేసిన నేతల్లో ఇండి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంత్ రాయగౌడ పాటిల్ (Yashavant Rayagoud Patil), సాగర్ ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ (Belur Gopalakrishna) ఉన్నారు. ఈ సందర్భంగా హైకమాండ్ నిర్ణయంపై ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తామన్న హామీని పార్టీ నిలబెట్టుకోలేదని యశ్వంతరాయగౌడ ఆరోపించగా.. కాంగ్రెస్‌లో మాజీ ముఖ్యమంత్రుల పిల్లలకే ప్రాధాన్యత దక్కుతుందంటూ గోపాలకృష్ణ మండిపడ్డారు.
కాగా, 34 మంది సభ్యులున్న రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న 20 మంత్రి పదవులను సోమవారం భర్తీ చేయనున్నారు. లోక్ భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ప్రస్తుత స్పీకర్ యు.టి. ఖాదర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో.. రాన్ ఎమ్మెల్యే జీఎస్ పాటిల్‌ని కర్ణాటక అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఎన్నుకోనున్నారు. విరాజ్‌పేట ఎమ్మెల్యే ఎ.ఎస్. పొన్నన్న డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అలాగే శాసనమండలిలో సీనియర్ సభ్యుడు సలీమ్ అహ్మద్ కొత్త చైర్మన్‌గా, నటి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఉమాశ్రీ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమితులు కానున్నారు.

Also Read..
సుప్రీంకోర్టు జడ్జిల పెంపు బిల్లుకు లోక్‌సభ గ్రీన్ సిగ్నల్
జంతర్ మంతర్ వద్ద నిరసనలు వద్దు.. వేదిక మార్చండి
ఈ20 సురక్షితమేనని ప్రభుత్వం నిరూపించలేకపోతోంది : జైరామ్ రమేశ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

DK Shivakumar | రాజీనామా చేస్తే.. క్షణం ఆలోచించకుండా ఆమోదిస్తా.. అసమ్మతి ఎమ్మెల్యేలకు డీకే స్ట్రాంగ్ వార్నింగ్
ఆగస్టు 4, 2026

DK Shivakumar | రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం: డీకే శివకుమార్
ఆగస్టు 2, 2026

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
ఆగస్టు 2, 2026
తాజావార్తలు
- ●Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్
- ●Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు
- ●MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
- ●Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన
- ●Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?
- ●Main Vaapas Aaunga | 'మై వాపస్ ఆవూంగా'... నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే...

Liquor Shops | అబ్బా.. హైదరాబాద్‌లో మళ్లీ వైన్స్ బంద్

Kavitha | చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే.. వారి కోసం మాట్లాడితే పళ్లు ఇకిలిస్తున్నరు

MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన



