Cauvery Water Row | విజయ్ బెంగళూరు పర్యటన వాయిదా వేసుకోవాలి.. డీకే శివకుమార్ సూచన
Cauvery Water Row | కావేరి జలాల వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. ఆగస్టు 3న మంత్రులతో కలిసి బెంగళూరుకు రావాలని విజయ్ భావిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని.. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనకు ఇది సరైన సమయం కాదని ఆయనకు వివరించినట్లు శివకుమార్ తెలిపారు.
Cauvery Water Row | కావేరి జలాల వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సూచించారు. ఆగస్టు 3న మంత్రులతో కలిసి బెంగళూరుకు రావాలని విజయ్ భావిస్తున్నట్లు తనకు సమాచారం ఉందని.. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటనకు ఇది సరైన సమయం కాదని ఆయనకు వివరించినట్లు శివకుమార్ తెలిపారు. విధానసౌధలో మంత్రులు జీ రామలింగారెడ్డితో కలిసి శివకుమార్ మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు వచ్చినప్పుడు వారికి స్వాగతం పలకడం తమ బాధ్యతేనని అన్నారు. అయితే కావేరి అంశంపై ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనూ భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నందున.. పర్యటన సందర్భంగా నిరసనలు, నినాదాలు జరిగితే అవి అనవసర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని చెప్పారు. పరిస్థితులు చక్కబడే వరకు కొంతకాలం వేచి ఉండాలని విజయ్‌ను కోరినట్లు వెల్లడించారు.
అఖిలపక్ష భేటీ తర్వాత నిర్ణయం
కావేరి అంశంపై ఆదివారం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు కురుస్తుండటంతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని విజయ్ పర్యటనకు కొత్త తేదీని నిర్ణయిస్తామని పేర్కొన్నారు. మేకెదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు కర్ణాటకతో పాటు తమిళనాడుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని శివకుమార్ అన్నారు. బెంగళూరు సహా కర్ణాటకలో తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు విద్యుత్ ఉత్పత్తికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని చెప్పారు. అయితే దీనిని సాగునీటి అవసరాల కోసం చేపట్టడం లేదని స్పష్టం చేశారు. కావేరి జలాల పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక గౌరవిస్తుందని శివకుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో వర్షపాతం, జలాశయాల్లో నీటి లభ్యత, ప్రస్తుత పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కోసం చర్చలు జరపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rakul Preet Singh | ఇక్కడ సమంత ... అక్కడ రకుల్ - బాలీవుడ్లోకి మా ఇంటి బంగారం
- ●Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్కతాలో అడుగుపెట్టిన తస్లీమా
- ●HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్కు శాశ్వత నీటి భద్రత
- ●Indiramma Tower | ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ పనులు
- ●Huawei MatePad 11.5 2026 | భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన హువావే మేట్ ప్యాడ్.. ధర ఎంతంటే..
- ●Singareni | థర్మల్ కేంద్రాలకు కొరత లేకుండా సరఫరా చేయాలి : సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్

Rakul Preet Singh | ఇక్కడ సమంత ... అక్కడ రకుల్ - బాలీవుడ్లోకి మా ఇంటి బంగారం

Taslima Nasrin | 19 ఏళ్ల తర్వాత.. కోల్కతాలో అడుగుపెట్టిన తస్లీమా

HMWSSB | వాన నీటిని ఒడిసిపట్టడమే హైదరాబాద్కు శాశ్వత నీటి భద్రత

Indiramma Tower | ఆగస్టు చివరి వారంలో ఇందిరమ్మ టవర్స్ పనులు





