Mumbai airport | రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. ముంబైలో షాకింగ్ ఘటన
Mumbai airport | ముంబై ఎయిర్‌పోర్టు (Mumbai airport)లో రెండు విమానాలు రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చాయి. ఓ విమానం పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
Mumbai airport | త్రినేత్ర.న్యూస్ : భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఎయిర్‌పోర్టు (Mumbai airport)లో రెండు విమానాలు రన్‌వేపైకి ఎదురెదురుగా వచ్చాయి. ఓ విమానం పైలట్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
రాత్రి 10 గంటల సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానం ముంబై ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఆ విమానం రన్‌వేపై ఉండగానే ముంబై నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం (Air India Aircraft) టేకాఫ్ కోసం రన్‌వేపైకి వచ్చింది. దీంతో రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. పరిస్థితిని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఎయిర్ ఇండియా విమానం పైలట్‌ను అప్రమత్తం చేశారు. పైలట్ వెంటనే టేకాఫ్‌ను ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనతో అక్కడకాస్త ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయితే, ముప్పు తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెండు విమానాల్లోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read..
బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత.. బంగారంపై పెట్టుబడులు పెట్టేవారికి అలర్ట్..
తాజావార్తలు
- ●Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
- ●Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు
- ●India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు
- ●Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
- ●Konda Surekha | రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
- ●SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు

Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు






