Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..
Google | గూగుల్ ఆండ్రాయిడ్ బ్యాకప్‌లకు సంబంధించిన స్టోరేజ్ విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. ఆండ్రాయిడ్ బ్యాకప్ సెట్టింగ్స్ ద్వారా సేవ్ అయ్యే డేటాను కూడా గూగుల్ అకౌంట్లో అందుబాటులో ఉన్న స్టోరేజ్‌లోనే లెక్కిస్తారు. దీంతో పాటు యూజర్లకు బ్యాకప్ అయ్యే డేటాపై మరింత నియంత్రణ ఇచ్చే కొత్త బ్యాకప్ కంట్రోల్స్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువస్తోంది.
Technology | Published On Jul 8, 2026, 12.00 pm IST
Google | గూగుల్ ఆండ్రాయిడ్ బ్యాకప్‌లకు సంబంధించిన స్టోరేజ్ విధానంలో కీలక మార్పులు ప్రకటించింది. ఆండ్రాయిడ్ బ్యాకప్ సెట్టింగ్స్ ద్వారా సేవ్ అయ్యే డేటాను కూడా గూగుల్ అకౌంట్లో అందుబాటులో ఉన్న స్టోరేజ్‌లోనే లెక్కిస్తారు. దీంతో పాటు యూజర్లకు బ్యాకప్ అయ్యే డేటాపై మరింత నియంత్రణ ఇచ్చే కొత్త బ్యాకప్ కంట్రోల్స్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటి వరకు గూగుల్ ఫోటోస్ ద్వారా బ్యాకప్ చేసిన ఫోటోలు, వీడియోలు, ఎంఎంఎస్ మీడియాను మాత్రమే గూగుల్ అకౌంట్ స్టోరేజ్‌లో లెక్కించేవారు. అయితే తాజా మార్పులతో ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ సందేశాలు, కాల్ హిస్టరీ, డివైస్ సెట్టింగ్స్, యాప్ డేటా, అలాగే ఆండ్రాయిడ్ బ్యాకప్ సెట్టింగ్స్ ద్వారా సేవ్ అయ్యే ఇతర సమాచారం కూడా గూగుల్ అకౌంట్లోని స్టోరేజ్ పరిమితిలో భాగమవుతుంది. ఈ మార్పు వల్ల సగటున ప్రతి ఆండ్రాయిడ్ బ్యాకప్ పరిమాణం సుమారు 40 ఎంబీ మేర పెరిగే అవకాశం ఉందని గూగుల్ తెలిపింది.
యూజర్లు స్వయంగా ఎంచుకోవచ్చు..
యూజర్లకు మరింత నియంత్రణ కల్పించేందుకు గూగుల్ కొత్త బ్యాకప్ టాగుల్స్ను అందిస్తోంది. వీటి ద్వారా ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ సందేశాలు, కాల్ హిస్టరీ, డివైస్ సెట్టింగ్స్‌ను బ్యాకప్‌లో చేర్చాలా లేదా మినహాయించాలా అనే విషయాన్ని యూజర్లు స్వయంగా ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లలో యాప్‌లకు ప్రత్యేక బ్యాకప్ కంట్రోల్స్‌ను గూగుల్ పరీక్షించింది. ఇప్పుడు వాటితోపాటు ఈ కొత్త ఆప్షన్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చి, ఏ డేటా బ్యాకప్ కావాలో యూజర్లే నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తోంది. పిక్సెల్ ఫోన్లలో ఈ కొత్త సదుపాయాలను సెట్టింగ్స్ > అకౌంట్స్ అండ్ బ్యాకప్ > గూగుల్ బ్యాకప్ > అదర్ డివైస్ డేటాలో పొందవచ్చు. లేదా సెట్టింగ్స్ యాప్‌లో బ్యాకప్ అని సెర్చ్ చేసినా సంబంధిత ఆప్షన్లు కనిపిస్తాయి. ప్రస్తుతం ప్రతి గూగుల్ అకౌంట్‌కు గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫోటోస్ కోసం కలిపి 15 జీబీ ఉచిత స్టోరేజ్ అందుబాటులో ఉంది. అదనపు స్టోరేజ్ అవసరమైతే గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ ద్వారా 100 జీబీ నుంచి ప్రారంభమయ్యే ప్లాన్లను ఎంచుకోవచ్చు.
మరింత జాగ్రత్తగా వాడాల్సిందే..
తాజా మార్పులతో ఆండ్రాయిడ్ బ్యాకప్‌లోని ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ సందేశాలు, కాల్ హిస్టరీ, డివైస్ సెట్టింగ్స్, యాప్ డేటా, ఇతర సపోర్ట్ చేసే బ్యాకప్ సమాచారాన్ని కూడా ఈ షేర్డ్ స్టోరేజ్‌లోనే లెక్కిస్తారు. దీంతో గూగుల్ అకౌంట్లో అందుబాటులో ఉన్న స్టోరేజ్‌ను యూజర్లు మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొత్త స్టోరేజ్ విధానం మంగళవారం నుంచి కొత్తగా ఆండ్రాయిడ్ బ్యాకప్ ఉపయోగించే యూజర్లకు దశలవారీగా అమల్లోకి వస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ బ్యాకప్ ఉపయోగిస్తున్న యూజర్లకు రాబోయే నెలల్లో ఈ మార్పు అందుబాటులోకి రానుంది. అలాగే ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ సందేశాలు, కాల్ హిస్టరీ, డివైస్ సెట్టింగ్స్‌కు సంబంధించిన కొత్త బ్యాకప్ కంట్రోల్స్ కూడా రాబోయే వారాల్లో దశలవారీగా విడుదల కానున్నాయి.
సంబంధిత వార్తలు

WhatsApp | డిలీట్ చేసిన వాట్సాప్ చాట్స్‌ను తిరిగి పొందడం ఎలా? ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు సింపుల్ టిప్స్!
అక్టోబర్ 31, 2026

Alphabet | గూగుల్‌కు ఏఐ దెబ్బ.. ఒక్కరోజే 511 బిలియన్ డాలర్ల నష్టం..
అక్టోబర్ 30, 2026

Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు
- ●IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి

Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన



