Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్
Heavy Rains | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, జమ్ము కశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి.
Heavy Rains | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై సహా సమీప ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. అనేక చోట్ల చెట్లు నెలకూలుతున్నాయి. ఈ భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది.
ఈ క్రమంలో ముంబై నగరానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. నగరంతోపాటూ శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలతోపాటూ గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో 100 మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రజారవాణా వ్యవస్థ యథావిధిగా కొనసాగుతోందని చెప్పారు. భారీ వర్షాల కారణంగా ముంబై సబర్బన్ లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలో పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
#WATCH | Navi Mumbai, Maharashtra | After heavy rainfall in the area, an underpass in Sanpada faces severe waterlogging, posing significant inconvenience to commuters.
IMD has issued a 'Red Alert' in Navi Mumbai, forecasting "very heavy to extremely heavy rainfall." pic.twitter.com/94lAus4rbD
— ANI (@ANI) July 4, 2026
భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలం..
గుజరాత్‌ను భారీ వర్షం ముంచెత్తింది. జామ్‌నగర్ (Jamnagar), జునాగఢ్ (Junagadh) ప్రాంతాలు భారీ వర్షాల ధాటికి తీవ్రంగా నష్టపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. రంగంలోకి దిగిన రెస్యూ టీమ్ వాహనాల్లోని ప్రయాణికులను తీవ్రంగా శ్రమించి కాపాడింది. మరో మూడు రోజులు గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
#WATCH | Junagadh, Gujarat | Fire Department rescued people stranded in floodwaters near Samdhiyala village in the Mendarda area. (03.07)
(Video Source: Information Department) pic.twitter.com/ShRYjx70uq
— ANI (@ANI) July 4, 2026
తాజావార్తలు
- ●Badrinath Dham | బద్రీనాథ్ ధామ్‌లోనూ కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశం
- ●Basara Temple | బాలాలయంలో కొలువుదీరనున్న చదువుల తల్లి.. రేపటి నుంచి గర్భగుడిలో అమ్మవారి దర్శనాలు బంద్
- ●Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- ●ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
- ●Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి

Badrinath Dham | బద్రీనాథ్ ధామ్‌లోనూ కానుకల దుర్వినియోగం ఆరోపణలు.. విచారణకు ఆదేశం

Basara Temple | బాలాలయంలో కొలువుదీరనున్న చదువుల తల్లి.. రేపటి నుంచి గర్భగుడిలో అమ్మవారి దర్శనాలు బంద్

Home Loan | హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది? కుటుంబంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు






