KTR | ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?: కేటీఆర్
KTR | మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని, నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృథా చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కాన్‌ను ప్రశ్నించారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు.
KTR | త్రినేత్ర.న్యూస్: మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెక్కులు వృథాగా పోతున్నాయని, నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృథా చేస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ సర్కాన్‌ను ప్రశ్నించారు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి సర్కారు తమాషా చూస్తున్నదని మండిపడ్డారు. వానల్లేక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రికి రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా? అన్నారు. మీ పగలు, ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోవాలని, రైతన్నలను ఆగం చేయొద్దని ఎక్స్ వేదికగా హితవు పలికారు.
`ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు. మరోపక్క..మేడిగడ్డ (Medigadda) కాడ వృథాగా కిందికి పోతున్న లక్ష ల క్యూసెక్కుల నీళ్లు. నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి తమాషా చూస్తున్నది సర్కారు. వానల్లేక..ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా?. కాళేశ్వరం (Kaleshwaram) దగ్గర పరవళ్లు తొక్కుతున్న గోదావరి జలాలను ఎత్తిపోసి..గోస తీర్చాలన్న సోయి కలగట్లేదా?. లోటు వర్షపాతంతో నాట్లు పడట్లేదు..విత్తనాలు వేయట్లేదు.. పంటలు సాగుచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమేమో ఏమీ పట్టించుకోకుండా దున్నపోతు మీద వానపడ్డట్టే వ్యవహరిస్తున్నది.
కన్నేపల్లి పంప్ హౌజ్ (Kannepally Pump House) మోటర్లను నడిపించి.. కరువు రాకుండా కాపాడుకోవాలన్న బుద్ధి ఎందుకు లేదు ఈ ప్రభుత్వానికి?. కేసీఆర్ (KCR) మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా?. ఎల్ నినో పడగ విప్పుతుంటే.. ముప్పు ముంచుకొస్తుంటే ఇంకా రాక్షస రాజకీయ క్రీడలు ఆడుతూ కూర్చుంటారా?. ఇంకెన్నాళ్లు కాళేశ్వరం మీద దుష్ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తారు?.
ముఖ్యమంత్రికి (Revanth Reddy) రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా?. మీ పగలు.. ప్రతీకారాలు ప్రతిపక్షం మీద తీర్చుకోండి, అన్నంపెట్టే రైతును మాత్రం ఆగం చేయకండి. తెలంగాణ (Telangana) రైతన్నలారా.. కాళేశ్వరంలో నిండుగా నీళ్లు పారుతున్నా మీ పొలాలను ఎండబెతున్న కాంగ్రెస్ (Congress) కర్కశ పాలన తీరును ప్రశ్నించండి. ఎక్కడా చుక్కనీళ్లు లేని కాలంలోనూ.. కాళేశ్వరమే ప్రాణేశ్వరమై కాపాడుతుందని అర్థం చేసుకోండి.` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
తాజావార్తలు
- ●Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్
- ●Jajula Srinivas Goud | కాంగ్రెస్ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
- ●Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?
- ●Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ
- ●Harish Rao vs Revanth Reddy | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం సెటిల్మెంట్లే.. దమ్ముంటే కౌడిపల్లికి రా..!
- ●Konda Surekha | నేను ఏ తప్పు చేయలేదు.. తలెత్తుకుని బతుకుతా.. ఎమ్మెల్యేగా కొనసాగుతా

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్

Jajula Srinivas Goud | కాంగ్రెస్ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్

Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?

Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ






