Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
Vande Bharat Express | దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై సహా సమీప ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి.
Vande Bharat Express | త్రినేత్ర.న్యూస్: దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai)ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంబై సహా సమీప ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కూడా నీటమునిగాయి. అయితే తాజాగా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటున్నది. మహానగరంలోని కాంజూర్‌మార్గ్ (Kanjurmarg) సమీపంలో రైలు పట్టాలు వరద నీటితో నిండిపోయాయి. ఆ మార్గం గుండా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) అత్యంత వేగంగా దూసుకెళ్లడం అందులో గమనించవచ్చు.

సాధారణంగా ముంబైలో చిన్న వర్షాలకే రైల్వే పట్టాలు పూర్తిగా నీట మునిగిపోతుంటాయి. ఇలాంటి సమయాల్లో రైళ్లను నిలిపివేయడం లేదా చాలా నెమ్మదిగా నడపడం చేస్తుంటారు. కానీ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం నీటిని చీల్చుకుంటూ వేగంగా ముందుకు సాగింది. రైలు వేగానికి పట్టాలపై నిలిచిన వరద నీరు రెండు వైపులా భారీ ఫౌంటెన్‌లా పైకి ఎగిసిపడింది. దీంతో పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై వెళ్తున్న కార్లు, ఇతర వాహనాలపై ఆ నీరు ఒక్కసారిగా పడిపోయాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఇది నిజంగా భారతీయ రైల్వే పవర్. వందే భారత్ దూసుకెళ్లిన తీరు అద్భుతంగా ఉంది అంటూ కొందరు, పట్టాలపై భారీగా నీరు ఉన్నప్పుడు అంత వేగంగా వెళ్లడం ప్రమాదకరం కాదా? ప్రశ్నిస్తున్నారు.
A stunning video of the Vande Bharat Express cutting through heavily waterlogged railway tracks near Kanjur Marg has gone viral amid Mumbai's relentless monsoon. Watch the dramatic moment that has everyone talking!
*VCRO*#MumbaiRains #VandeBharat #Mumbai pic.twitter.com/HDNy1CA3QK— Udit Mehta (@mehtaudit_101) July 4, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






