Delhi Hotel Fire | అగ్నిప్రమాదంలో 13 మంది విదేశీయులు మరణించారు : విదేశాంగ శాఖ
Delhi Hotel Fire | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై (Delhi Hotel Fire) కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) కీలక ప్రకటన చేసింది.
Delhi Hotel Fire | దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై (Delhi Hotel Fire) కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs) కీలక ప్రకటన చేసింది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randhir Jaiswal) మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మృతులు మొజాబిక్, నైజీరియా, లైబీరియా, కిర్గిజిస్థాన్, ఉజ్బెకిస్థాన్, బంగ్లాదేశ్, కాంగో, ఇరాక్‌కు చెందిన వారని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని స్వదేశాలకు తరలించేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 20 నుంచి 22 మంది విదేశీయులు కూడా గాయపడినట్లు తెలిపారు. వారికి అవసరమైన వైద్య సహాయం చేస్తామని చెప్పారు.
ఢిల్లీలోని మాలవీయ నగర్ (Malviya Nagar)లోని ఓ హోటల్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం సంభవించిన (Delhi Hotel Fire) విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని హౌజ్ రాణి (Hauz Rani) ప్రాంతంలో అత్యంత రద్దీగా ఉండే ఏరియాలో ఈ 'ఫ్లోరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్' (Flourish Stay B&B) హెటల్ ఉంది. ఈ దుర్ఘటనలో 21 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ (Short Circuit) వల్లే ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Also Read..
మణిపూర్‌లో మళ్లీ హింస.. గ్రామంపై కాల్పులు, ఇళ్లకు నిప్పు.. ముగ్గురు మృతి
హీరోగా మారిన టాలీవుడ్ కమెడియన్ - వెరైటీ టైటిల్‌తో వెబ్‌సిరీస్
సంబంధిత వార్తలు

Ramchandar Rao | అమెరికా టూర్‌కు రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదంటే.. రాంచందర్‌రావు ఏమన్నారంటే..
ఆగస్టు 21, 2026

Supreme Court | ఏం చర్యలు తీసుకున్నారు..? ఢిల్లీ, లక్నో అగ్నిప్రమాదాలపై అధికారులకు సుప్రీంకోర్టు అల్టిమేటం
జులై 9, 2026

Indus Water Treaty | సింధు జలాల ఒప్పందంలో భారత్ వైఖరిలో మార్పులు లేదు.. పాక్‌కు స్పష్టం చేసిన విదేశాంగ శాఖ
జులై 3, 2026
తాజావార్తలు
- ●Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు
- ●Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
- ●Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Harish Rao | భూభారతి పోర్టల్ నుంచి 22 A జాబితాను రాత్రికి రాత్రే ఎందుకు మాయం చేశారు?: హరీశ్ రావు

Software Engineer | కార్పొరేటర్ విజయారెడ్డిపై సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్

Horoscope | ఆగస్టు 24 రాశి ఫలాలు.. ఈ రాశివారు లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు శ్రమ అవసరం!

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!



