త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhis Draft Electoral Roll | ఢిల్లీ ఓట‌ర్ల‌ జాబితా నుంచి 47.7 ల‌క్ష‌ల పేర్లు తొల‌గింపు

Delhis Draft Electoral Roll | ఢిల్లీలో ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా (Draft Electoral Roll) నుంచి సుమారు 47.7 లక్షల మంది పేర్లను తొలగించారు. కేవ‌లం 97.5 లక్షల పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో ఉన్నాయి.

D

National | Published On Aug 31, 2026, 1.41 pm IST

Delhis Draft Electoral Roll | ఢిల్లీ ఓట‌ర్ల‌ జాబితా నుంచి 47.7 ల‌క్ష‌ల పేర్లు తొల‌గింపు
Advertisement

Delhis Draft Electoral Roll | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా (Draft Electoral Roll)లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌లో భాగంగా సుమారు 47.7 లక్షల మంది పేర్లను తొలగించారు. ఈ మేర‌కు ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల జాబితాలను (SIR Rolls) ప్రచురించింది.

ఢిల్లీలో మొత్తం 1,45,10,299 మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. జూన్ 30న ప్రారంభమై ఆగస్టు 17తో ముగిసిన ఇంటింటికీ స‌ర్ ప్ర‌క్రియ‌లో ఎన్యుమ‌రేష‌న్ ఫార‌మ్‌లు స్వీక‌రించి డిజిట‌ల్ రూపంలో పొందుప‌రిచిన దాదాపు 97.5 లక్షల పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో ఉన్నాయి. మిగిలిన 47.7 లక్షల మందిని వలస వెళ్లినవారు, మరణించినవారు లేదా డూప్లికేట్ ఓటర్లుగా పరిగణిస్తున్నారు. అయితే, ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ( Delhi Chief Electoral Officer) తెలిపారు.

అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకోవడానికి అవసరమైన సహాయక పత్రాలతో కూడిన ఫారం-6 (Form-6) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చ‌ని చెప్పారు. అభ్యంతరాలకు సెప్టెంబరు 30వ తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు. తుది జాబితాలను నవంబరు 4న వెలువరిస్తామని వెల్ల‌డించారు.

Also Read..

పెట్రోల్‌లో ఇథ‌నాల్ శాతాన్ని క‌చ్చితంగా వెల్ల‌డించాలి.. సుప్రీంకోర్టు కీల‌క నిర్ణ‌యం

రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ న‌మోదు

కళ్లముందే కరిగిపోయిన మంచుకొండ.. నేపాల్ వరదల భయానక దృశ్యాలు డ్రోన్‌లో రికార్డ్

Advertisement
Advertisement