త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi | మైన‌ర్‌పై గ్యాంగ్‌రేప్‌.. ఆపై హ‌త్య‌.. శ‌వాన్ని పీక్కుతిన్న కుక్క‌లు

Delhi | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. అనంత‌రం యువ‌తిని దారుణంగా హ‌త్య చేయ‌గా.. మృత‌దేహాన్ని కుక్క‌లు పీక్కుతిన్నాయి.

D

National | Published On Sep 18, 2026, 10.45 am IST

Delhi | మైన‌ర్‌పై గ్యాంగ్‌రేప్‌.. ఆపై హ‌త్య‌.. శ‌వాన్ని పీక్కుతిన్న కుక్క‌లు
Advertisement

Delhi | త్రినేత్ర‌.న్యూస్ : దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. అనంత‌రం యువ‌తిని దారుణంగా హ‌త్య చేయ‌గా.. మృత‌దేహాన్ని కుక్క‌లు పీక్కుతిన్నాయి. వాయువ్య ఢిల్లీలోని (Northwest Delhi) స్వ‌రూప్ ప్రాంతంలోని (Swaroop Nagar) కుషాక్ రోడ్డు స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. 17 ఏళ్ల బాలిక‌పై న‌లుగురు వ్య‌క్తులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమెను క‌త్తితో దారుణంగా హ‌త్య చేసి మృత‌దేహాన్ని బ‌హిరంగ ప్ర‌దేశంలో ప‌డేశారు. సెప్టెంబ‌ర్ 13న ఉద‌యం కుళ్లిన స్థితిలో ఉన్న‌ మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న పోలీసులు బాలిక మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఆమె శ‌రీర భాగాల‌ను కుక్క‌లు పీక్కుతిన్న‌ట్లు గుర్తించారు. బాలిక చెయ్యి స‌మీపంలో ప‌డిపోయి ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

అయితే, బాలిక మిస్సైన‌ట్లు కుటుంబ స‌భ్యులు ఎక్క‌డా ఫిర్యాదు చేయ‌లేద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఆమె త‌ర‌చుగా ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేద‌ని.. కొన్ని రోజుల త‌ర్వాత తిరిగి వ‌స్తుండేద‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు.. దాదాపు 50కి పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ప‌రిచ‌యం ఉన్న న‌లుగురు వ్య‌క్తులే ఈ అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మైన‌ర్ల‌ని వెల్ల‌డించారు. ఘ‌ట‌న జ‌రిగిన రోజు వారు ఒక టెంపో వాహ‌నంలో క‌లిసి ప్ర‌యాణించిన‌ట్లు చెప్పారు. టెంపోలోనే మ‌ద్యం తాగి ఆ త‌ర్వాత అఘాయిత్యానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు వివ‌రించారు.

సెప్టెంబ‌ర్ 15న రాత్రి నిర్వ‌హించిన గాలింపు చ‌ర్య‌ల్లో టెంపో డ్రైవ‌ర్‌ను గుర్తించి ప్ర‌శ్నించారు. ఈ విచారణ ఆధారంగా నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌ధాన నిందితుడు ఖద్దా కాలనీకి చెందిన శివ‌మ్ అలియాస్ సుదామ అలియాస్ చుచుగా గుర్తించారు. మిగ‌తా ముగ్గురు నిందితులు 16, 17 ఏళ్ల వ‌య‌సు గ‌ల మైన‌ర్ల‌ని పోలీసులు తెలిపారు. ఈ మేర‌కు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు హ‌త్య‌కు ఉప‌యోగించిన రెండు క‌త్తులు, టెంపో వాహ‌నాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార‌తీయ న్యాయ సంహిత‌, పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసి స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

Also Read..

ఫార్ములా ఈ రేస్ కేసు.. నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రైన కేటీఆర్

త‌గ్గిన ముడి చ‌మురు ధ‌ర‌లు.. స్వ‌ల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

పొర‌పాటున పేలిన తుపాకీ.. ఇన్‌స్పెక్ట‌ర్ మృతి

Advertisement
Advertisement