BSF Recruitment | డిగ్రీ అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో 1,167 ఎస్‌ఐ పోస్టులు..
BSF Recruitment | కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (LDCE) 2026 ద్వారా సబ్-ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
BSF Recruitment | త్రినేత్ర న్యూస్: కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (LDCE) 2026 ద్వారా సబ్-ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 1167 ఖాళీలతో డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నోటిఫికేషన్ విడుదల (BSF Recruitment) చేసింది. అర్హులైన పురుష, మహిళా సర్వీస్ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. రాతపరీక్ష, పీఈటీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతి నెల రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం వస్తుంది.
మొత్తం ఖాళీలు: 1,167
బీఎస్‌ఎఫ్- 235 పోస్టులు (పురుషులకు 223, మహిళలకు 12)
జనరల్ 182, ఎస్సీ 35, ఎస్టీ 18
సీఆర్‌పీఎఫ్- 377 పోస్టులు (పురుషులు: 347, మహిళలు: 30)
జనరల్ 292, ఎస్సీ 57, ఎస్టీ 28
ఎస్‌ఎస్‌బీ- 125 పోస్టులు (పురుషులు: 125)
జనరల్ 97, ఎస్సీ 19, ఎస్టీ 9
ఐటీబీపీ- 430 పోస్టులు (పురుషులు: 430)
జనరల్ 342, ఎస్సీ 56, ఎస్టీ 32
అర్హత: డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి, గత ఐదేండ్లుగా కనీసం `గూడ్స్` ఏపీఏఆర్ గ్రేడింగ్‌ను కలిగి ఉండాలి. 31 డిసెంబర్ 2026 నాటికి గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీలలో సర్వీస్ చేస్తున్న కానిస్టేబుల్ (GD), కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్), హెడ్ కానిస్టేబుల్ (GD), ఏఎస్‌ఐ (GD), ఎస్‌ఎస్‌బీకి చెందిన ఏఎస్‌ఐ (GD) దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు బేసిక్ ట్రైనింగ్‌తో పాటు కనీసం 4 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షల ఆధారంగా (రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది).
రాతపరీక్ష 200 మార్కులకు ఉంటుంది. 3.30 గంటల్లో పరీక్ష పూర్తి చేయాలి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, కాంప్రహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్ అండ్ ప్రొవిజనల్ నాలెడ్జ్ నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 31
వెబ్‌సైట్: https://bsf.mha.gov.in
తాజావార్తలు
- ●ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!
- ●Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు
- ●Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..
- ●Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!
- ●Tirumala | ఏడాదికి ఒక్కసారి జరిగే ఉగ్రశ్రీనివాసుడి ఉత్సవం.. సూర్యోదయానికి ముందే తిరుమలలో మహాద్భుతం!
- ●Nasha Mukt Bharat | హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’పై భారీ అవగాహన కార్యక్రమం

ED Raids | హవాలా కేసులో ఈడీ సోదాలు.. 4 గంటల తర్వాత అసలు విషయం తెలుసుకొని..!

Chief Minister | సొంత రాష్ట్రాన్ని పట్టించుకోని ముఖ్యమంత్రి.. హర్యానా సీఎంపై విమర్శలు

Dada Saheb Phalke Awards | ఉత్తమ నటుడిగా రణ్‌వీర్‌సింగ్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ధురంధర్ హవా..

Horoscope | నవంబర్ 21 రాశిఫలాలు.. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది!






