Ram temple donation theft case | రాముడి పేరును బద్నాం చేయకండి.. విరాళాల చోరీపై కాంగ్రెస్
Ram temple donation theft case | అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు (Ram temple donation theft case)లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. విరాళాల పేరుతో రాముడి పేరును బద్నాం చేయకండి అంటూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.
Ram temple donation theft case | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసు (Ram temple donation theft case) దర్యాప్తు పూర్తై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ మేరకు 1971లో వచ్చిన ప్రముఖ బాలీవుడ్ చిత్రం హరే రామ హరే కృష్ణ సినిమాలోని రామ్ కా నామ్ బద్నామ్ నా కరో పాటలోని చరణాలను ప్రస్తావిస్తూ బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. విరాళాల చోరీ ఆరోపణలతో రాముడి కీర్తికి భంగం కలిగించొద్దని వ్యాఖ్యానించింది.
ఆ కేసులో సెప్టెంబరు 25లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టుకు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) తాజాగా స్పందించారు. గడువులోపు ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోతే ఈ కేసులో నిందితులకు బెయిల్ లభించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులను కాపాడేందుకు కొందరు కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. సీసీటీవీ ఫుటేజ్‌పై నిర్వహించిన ఫోరెన్సిక్ పరిశీలనలో 105 సార్లు విరాళాల చోరీ జరిగినట్లు సోలిసిటర్ జనరల్ స్వయంగా కోర్టులో పేర్కొన్న విషయాన్ని జైరాం రమేష్ గుర్తుచేశారు.
ఈ కేసులో అసలు బాధ్యులు ఎవరో తేల్చాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. కేవలం చిన్న స్థాయి నిందితులపై చర్యలు తీసుకోవడం కాకుండా, మొత్తం వ్యవస్థను పరిశీలించాలని కోరారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను పూర్తిగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రామ మందిరం విరాళాల చోరీ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడంపై జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ప్రజల విశ్వాసంతో ముడిపడిన ఈ తీవ్రమైన అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read..
దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
బీహార్ మైనర్ల వేధింపుల కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు అరెస్ట్
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jairam Ramesh | నోటాకు ప్రధాని కొత్త అర్థం చెప్పారు.. యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
సెప్టెంబర్ 16, 2026

Jairam Ramesh | యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు రంగం సిద్ధం : జైరామ్ రమేష్
సెప్టెంబర్ 15, 2026

Ayodhya Case | అయోధ్య రామాలయం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●MMTS | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు
- ●iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
MMTS | హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం.. అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు

iPhone 18 Pro | ఐఫోన్ 18 యూజర్లకు షాక్.. పనిచేయని ఫేస్ ఐడీ..

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ - 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ



