Dimple Hayathi | నాకింకా పెళ్లి కాలేదు – నెటిజన్ కామెంట్‌పై డింపుల్ హయతి రిప్లై
శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన భోగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో హీరో శర్వానంద్‌తో హీరోయిన్ డింపుల్ హయతి చాలా క్లోజ్‌గా కనిపించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను ఉద్దేశిస్తూ తన పెళ్లిపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు డింపుల్ స్వయంగా రిప్లై ఇచ్చింది.
Entertainment | Published On Nov 23, 2026, 11.33 am IST
Dimple Hayathi | తన పెళ్లి గురించి ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు డింపుల్ హయతి రిప్లై ఇచ్చింది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన భోగి మూవీ నవంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు. భోగి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
సిగ్గుపడుతూ.....
ఈ వేడుకకు డింపుల్ హయతి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శర్వానంద్‌తో డింపుల్ హయతి చాలా క్లోజ్‌గా కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకే ఛైర్‌లో ఇద్దరూ కూర్చున్నారు. శర్వానంద్ మాటలకు డింపుల్ సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత స్టేజ్‌పై కూడా ఇద్దరి మధ్య అదే బాండింగ్ కనిపించింది.
డింపుల్ రిప్లై....
ఈ వీడియోను ఉద్దేశించి ఓ నెటిజన్ డింపుల్‌కు కూడా పెళ్లయ్యిందంటూ కామెంట్ పెట్టాడు. అతడి కామెంట్‌కు డింపుల్ స్వయంగా రిప్లై ఇచ్చింది. నాకింకా పెళ్లికాలేదంటూ బదులిచ్చింది.ఆమె ఆన్సర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. డింపుల్ హయతి పెళ్లి చేసుకున్నట్లుగా చాలా రోజులుగా రూమర్లు వస్తున్నాయి. విక్టర్ డేవిడ్ అతడిని వివాహం చేసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. శర్వానంద్ వీడియో ద్వారా మరోసారి పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణ యాసలో...
ఇప్పటివరకు నా గ్లామర్ సాంగ్స్, డాన్స్ చూశారు.మొదటిసారి నాలోని యాక్టింగ్ టాలెంట్‌ను చూపించే అవకాశం ఈ సినిమాతో దొరికింది. భోగిలో మందారం అనే వైవిధ్యమైన క్యారెక్టర్ చేశా. చాలా పవర్‌ఫుల్‌గా నా పాత్ర సాగుతుంది. ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడాను. అనుపమతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. శర్వానంద్ గారు ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తారు. కచ్చితంగా ఈ సినిమా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది అని చెప్పింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Satvika Veeravalli | ఒక్క సినిమాతోనే సెన్సేషన్ – ఆకాశంలో ఒక తార హీరోయిన్‌కు అవకాశాల వెల్లువ!
నవంబర్ 21, 2026

Anirudh Kavya Maran Reception | అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్
నవంబర్ 21, 2026

Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా … నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది – చంద్రబోస్ కామెంట్స్
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్
- ●Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!
- ●Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ
- ●WTC 2027 Final | డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు చావోరేవో..!
- ●IND Vs NZ | డ్రాగా ముగిసిన వెల్లింగ్టన్ టెస్టు.. భారత విజయానికి అడ్డుకట్ట వేసిన కివీస్ బ్యాటర్లు
- ●Virosh | అనిరుధ్, కావ్య మారన్ రిసెప్షన్లో విరోష్ - ఫొటోలు చూశారా?

Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్

Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!

Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షితమే.. FSSAI చర్యలపై బిస్లరీ వివరణ

WTC 2027 Final | డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియాకు చావోరేవో..!



