త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షిత‌మే.. FSSAI చర్యలపై బిస్ల‌రీ వివరణ

Bisleri Water | బిస్లరీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్ (Bisleri Water) సురక్షితం కాదంటూ FSSAI చేసిన ప్ర‌క‌ట‌న‌పై సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మ నీరు తాగేందుకు పూర్తిగా సుర‌క్షిత‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. తాగునీటి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్ల‌డించింది. "ఏళ్లుగా నమ్మకమైన బ్రాండ్‌గా ఉన్న బిస్లరీ తాగేందుకు ఎల్లప్పుడూ సురక్షితమే" అని స్పష్టం చేసింది.

D

National | Published On Nov 23, 2026, 11.36 am IST

Bisleri Water | మా నీరు తాగేందుకు పూర్తిగా సురక్షిత‌మే.. FSSAI చర్యలపై బిస్ల‌రీ వివరణ
Advertisement

Bisleri Water | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ బిస్లరీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్ సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చేసిన ప్ర‌క‌ట‌న‌పై సంస్థ వివ‌ర‌ణ ఇచ్చింది. త‌మ నీరు తాగేందుకు పూర్తిగా సుర‌క్షిత‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. రిఫరల్ ల్యాబ్, FSSAI గుర్తింపు పొందిన ప్రయోగశాలలో నిర్వహించిన స్వతంత్ర పరీక్షల్లో బ్రోమేట్ స్థాయిలు నిర్ణీత పరిమితుల్లోనే ఉన్నట్లు తేలిందని కంపెనీ తెలిపింది.

ఇటీవలే బిస్లరీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ నమూనాలను ప‌రీక్షించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో బ్రోమేట్ పరిమితులు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని, అలాగే అప్పీల్ తర్వాత రిఫరల్ ల్యాబ్ పరీక్షల్లో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్‌లు (PAHs) గుర్తించినట్లు వెల్లడించింది. ఈ మేర‌కు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం ఆ నమూనాను సురక్షితం కానిదిగా ప్రకటించి, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో సంస్థ వివ‌ర‌ణ ఇస్తూ అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

గోవా బ్యాచ్ వివాదం

బిస్ల‌రీ సంస్థ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 2025 సెప్టెంబ‌ర్ 30న గోవా త‌యారీ కేంద్రం నుంచి (Goa manufacturing facility) ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆరు న‌మూనాల‌ను సేక‌రించిన‌ట్లు సంస్థ తెలిపింది. ప్రాథ‌మిక ప‌రీక్ష‌ల్లో ఐదు న‌మూనాలు అన్ని ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉండ‌గా.. ఆరో న‌మూనాలో బ్రోమేట్ స్థాయి నిర్ణీత ప‌రిమితి కంటే కొంచెం ఎక్కువగా అంటే లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైన‌ట్లు తెలిపింది. ఈ ఫ‌లితాల‌పై 2025 న‌వంబ‌ర్ 25న అప్పీల్ చేయ‌డంతో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆ నమూనాను రీ-టెస్టింగ్ కోసం రిఫరల్ ల్యాబొరేటరీకి పంపిన‌ట్లు తెలిపింది. రిఫరల్ ల్యాబ్ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయి పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని వెల్ల‌డించింది. అయితే అందులో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు ల్యాబ్ పేర్కొందని కంపెనీ వివ‌రించింది.

ఆ అంశం ముగిసిపోయింద‌నుకున్నాం

రెండు పరీక్షల ఫలితాల మధ్య వ్యత్యాసం ఉండటంతో, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదం పొందిన మరో స్వతంత్ర ల్యాబ్‌లో తాము ఆ నమూనాను పరీక్షించగా, అందులోనూ బ్రోమేట్ పరిమితికి లోబడే ఉన్నట్లు స్పష్టమైందని కంపెనీ వెల్లడించింది. స్వతంత్ర ల్యాబొరేటరీ పరీక్షల ఫలితాలను 2026 ఫిబ్రవరి 2న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెస్ట్రన్ రీజినల్ కార్యాలయానికి అధికారికంగా లేఖ స‌మ‌ర్పించిన‌ట్లు బిస్ల‌రీ తెలిపింది. ఆ ఫలితాలు అంద‌జేసిన త‌ర్వాత నియంత్ర‌ణ సంస్థ నుంచి త‌మ‌కు ఎలాంటి త‌దుప‌రి స‌మాచారం రాలేద‌ని పేర్కొంది. దాంతో ఆ విష‌యం ముగిసిపోయింద‌ని తాము భావించామ‌ని కంపెన ఈవివ‌ర‌ణ ఇచ్చింది.

ఎలాంటి నోటీసు అంద‌లేదు..

ఇప్పటివరకు ఈమెయిల్ ద్వారా గానీ, హార్డ్ కాపీ రూపంలో గానీ FSSAI నుంచి ఎటువంటి నోటీసు అందలేద‌ని కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వెబ్‌సైట్‌లో కూడా సదరు నోటీసు కనిపించలేద‌ని త‌న ప్రకటనలో వెల్ల‌డించింది. తాగునీటి భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, 10 దశల తయారీ ప్రక్రియలో 90కి పైగా కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. "ఏళ్లుగా నమ్మకమైన బ్రాండ్‌గా ఉన్న బిస్లరీ తాగేందుకు ఎల్లప్పుడూ సురక్షితమే" అని స్పష్టం చేసింది.

బిస్లరీపై విచారణకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి

బిస్లరీ వాటర్‌( Bisleri Water) సురక్షితమేమీ కాదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI ) వెల్లడించింది. ఇటీవల బిస్లరీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరీక్షించింది. పరిమితికి మించి బ్రోమేట్‌ స్థాయిలు ఆ నీటిలో ఉన్నట్లు వెల్లడించింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం ప్రకారం బిస్లరీ సురక్షితం కాదని పేర్కొంది. దీంతో సంస్థ అప్పీల్‌ చేయడంతో ఫుడ్‌ ల్యాబొరేటరీలో మరోసారి పరీక్షలు చేశారు. ల్యాబ్‌ పరీక్షల్లోనూ ఆ నీళ్లలో పాలీ న్యూక్లియర్‌ ఏరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌ చర్యలు తీసుకునేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అనుమతి మంజూరు చేసింది.

Also Read..

నాకింకా పెళ్లి కాలేదు - నెటిజ‌న్ కామెంట్‌పై డింపుల్ హ‌య‌తి రిప్లై

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు చావోరేవో..!

కీస‌ర రామ‌లింగేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్

Advertisement
Advertisement