త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gaurav Gogoi | ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు పూల‌మాల‌ల‌తో స‌త్కార‌మా..? ఆయ‌నేమైనా పాకిస్థాన్‌పై యుద్ధం గెలిచొచ్చారా..? : గౌర‌వ్ గొగోయ్

Gaurav Gogoi | నీట్ పేప‌ర్ లీక్ అంశంలో మోదీ స‌ర్కార్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని పేర్కొన్నారు. 21 మంది విద్యార్థుల మృతికి కార‌ణమైన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan)ను పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

D

National | Published On Jul 28, 2026, 4.49 pm IST

Gaurav Gogoi | ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌కు పూల‌మాల‌ల‌తో స‌త్కార‌మా..? ఆయ‌నేమైనా పాకిస్థాన్‌పై యుద్ధం గెలిచొచ్చారా..? : గౌర‌వ్ గొగోయ్
Advertisement

Gaurav Gogoi | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన ఏడు రోజుల త‌ర్వాత తొలిసారి స‌భ‌లో వాడీవేడి చ‌ర్చ మొద‌లైంది. లోక్‌స‌భ‌లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన యాంటీ పేప‌ర్ లీక్ బిల్లుపై అధికార‌, విప‌క్ష ఎంపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. నీట్ పేప‌ర్ లీక్ అంశంలో మోదీ స‌ర్కార్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. లీకేజీ కేసుల విచారణలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శించిందని పేర్కొన్నారు. 21 మంది విద్యార్థుల మృతికి కార‌ణమైన ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ (Dharmendra Pradhan)ను పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.

"ప్రశ్నపత్రం లీక్ అయిన తర్వాత నీట్ ప‌రీక్షను కేంద్రం ర‌ద్దు చేసింది. దీంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారు ఏ మంత్రి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయారో ఇక్క‌డున్న‌ అంద‌రికీ తెలుసు. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి నిన్న స‌భ‌కు వ‌చ్చారు. ఆయ‌న్ని మీరు పాకిస్థాన్‌పై యుద్ధం గెలిచి వ‌చ్చిన‌ట్లుగా పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించారు" అని గొగోయ్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు.

ప్ర‌ధాని రీల్స్ సందేశాల‌కే ప్రాధాన్య‌మిచ్చారు..

అదే స‌మ‌యంలో విద్యార్థి నిర‌స‌న‌కారుల‌ను ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ విడుద‌ల చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోల‌పై కూడా గొగోయ్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. నీట్ లీకేజీతో 21 మంది విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నా ప్ర‌ధాని క‌నీసం స్పందించ‌లేద‌ని గొగోయ్ వ్యాఖ్యానించారు. రీల్స్ సందేశాల‌కే ప్రాధాన్య‌త ఇచ్చార‌ని మండిప‌డ్డారు. టాస్క్‌ఫోర్స్‌ వేశామంటూ ప్రధాని చెప్పడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల క్రితం కూడా నిపుణుల కమిటీ వేశారని, దానిపై ఏం స‌మాధానం చెప్తార‌ని ప్రశ్నించారు. 2024లో జ‌రిగిన లీక్ ఘ‌ట‌న‌లో 40 నుంచి 45 మంది నిందితుల‌కు బెయిల్ ఇచ్చార‌ని గుర్తు చేశారు.

రెండేళ్ల క్రితమే కఠిన చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇప్పుడు లీకేజీల‌కు ఆస్కారం ఉండేది కాదు కదా..? అని నిల‌దీశారు. పదే పదే లీకేజీలు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండిపోయిందని వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో సీజేపీ నిర‌స‌న‌ల సంద‌ర్భంగా మహిళలు సహా విద్యార్థి నిరసనకారులపై టియర్ గ్యాస్, పెల్లెట్ గన్లు, లాఠీఛార్జి దాడికి ఎవ‌రు ఆదేశించారంటూ ప్ర‌శ్నించారు. ఈ అంశంపై త‌మ‌కు సమాధానాలు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

నేను స్ట్రీట్‌ ఫైటర్‌ను.. విప‌క్షాల‌కు ధ‌ర్మేంద్ర కౌంట‌ర్‌

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ రాజీనామా త‌ర్వాత నిన్న ఎంపీ హోదాలో తొలిసారి పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఊహించ‌ని రీతిలో ఆయ‌న‌కు ఎన్డీయే మిత్ర‌ప‌క్ష ఎంపీలు స్వాగ‌తం ప‌లికారు. "ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్" అంటూ నినాదాలు చేస్తూ ఆయనను లోపలికి తోడ్కొని వెళ్లారు. సంప్ర‌దాయ టోపీ పెట్టి, పూల‌మాల‌ల‌తో స‌త్క‌రించారు. క‌ష్ట‌స‌మ‌యంలో అండ‌గా ఉంటామ‌నే భ‌రోసా ఇచ్చారు. అదే స‌మ‌యంలో అక్క‌డికి వ‌చ్చిన కాంగ్రెస్ నేత జైరాం ర‌మేష్‌.. "ఇలా జరుగుతూ ఉంటుంది" అని అన్నారు. స్పందించిన ధర్మేంద్ర "ఏమీ జరగలేదు.. నేను స్ట్రీట్‌ ఫైటర్‌ను. ఏసీ గదుల్లో కూర్చునే కార్యకర్తను కాదు" అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూనే గొగోయ్ పైవిధంగా వ్యాఖ్యానించారు.

Also Read..

యూపీఏ హ‌యాంలోనే పేప‌ర్ లీక్‌లు.. అప్పుడెందుకు చ‌ర్య‌లు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్

చిన్నారుల కోసం ప్ర‌త్యేకంగా గూగుల్ మ్యాప్స్ స‌హిత స్మార్ట్ వాచ్‌.. లైవ్ ట్రాకింగ్ ఫీచ‌ర్‌తో లాంచ్‌..

తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ - డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో చెన్నై క్వీన్‌

Advertisement
Advertisement