boAt | చిన్నారుల కోసం ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్స్ సహిత స్మార్ట్ వాచ్.. లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌తో లాంచ్..
boAt | భారత మార్కెట్లో ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిడ్ సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్‌తో పిల్లల లైఫ్‌స్టైల్ టెక్నాలజీ విభాగంలోకి కంపెనీ అడుగుపెట్టింది. ఇందులో సైలర్ నావ్ కనెక్టెడ్ స్మార్ట్‌వాచ్, సైలర్ ప్లే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది.
Technology | Published On Jul 28, 2026, 3.45 pm IST
boAt | భారత మార్కెట్లో ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కిడ్ సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్‌తో పిల్లల లైఫ్‌స్టైల్ టెక్నాలజీ విభాగంలోకి కంపెనీ అడుగుపెట్టింది. ఇందులో సైలర్ నావ్ కనెక్టెడ్ స్మార్ట్‌వాచ్, సైలర్ ప్లే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను లాంచ్ చేసింది. పిల్లల భద్రత, తల్లిదండ్రులతో కమ్యూనికేషన్, వినోదం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్పత్తులను రూపొందించింది. సైలర్ నావ్ స్మార్ట్‌వాచ్ పిల్లల కోసం రూపొందించిన కనెక్టెడ్ స్మార్ట్‌వాచ్. ఇందులో రియల్‌టైమ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ట్రాకింగ్ సౌకర్యం ఉంటుంది. పిల్లలు స్కూల్‌లో ఉన్నా, పార్క్‌లో ఆడుతున్నా లేదా ప్రయాణంలో ఉన్నా, వారి ప్రస్తుత లొకేషన్‌ను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 5 పాయింట్ శాటిలైట్ పొజిషనింగ్ ఆధారిత జియో-ఫెన్సింగ్ ఫీచర్ కూడా ఉంది. దీంతో తరచూ వెళ్లే ప్రదేశాలను సేఫ్ జోన్లుగా గుర్తించి, పిల్లలు ఆ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు లేదా బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులకు వెంటనే అలర్ట్ అందుతుంది. ఈ వాచ్‌ను ఉపయోగించడానికి పిల్లలు ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
4జి సిమ్ సపోర్ట్..
కమ్యూనికేషన్ కోసం ఇందులో బిల్ట్-ఇన్ 4జి సిమ్ సపోర్ట్‌తో టూ-వే వీడియో కాలింగ్, వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంది. తల్లిదండ్రులు నేరుగా వాచ్ ద్వారానే పిల్లలతో మాట్లాడవచ్చు. 1.44 ఇంచుల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలో వీడియో కాల్స్, సందేశాలు, నావిగేషన్ సమాచారాన్ని చూడవచ్చు. అలాగే ఆడియో చాట్ ద్వారా ఇతర సైలర్ నావ్ వినియోగదారులతో వాయిస్ మెసేజ్‌లు పంపుకునే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎస్‌ఓఎస్ ఫీచర్, రోజువారీ ఉపయోగానికి అవసరమైన పలు యుటిలిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. రోజువారీ వినియోగానికి అనువుగా ప్రాసెసర్, బ్యాటరీని అందించింది. ఈ స్మార్ట్‌వాచ్‌లో రియల్‌టైమ్ జీపీఎస్ ట్రాకింగ్, ప్రస్తుత లొకేషన్, చివరిసారిగా నమోదైన లొకేషన్, బ్యాటరీ స్థాయి, టైమ్‌స్టాంప్, లొకేషన్ హిస్టరీ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. 2 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు రిమోట్ ఫొటో క్యాప్చర్ ఫీచర్ కూడా ఉంది. బోట్ సైలర్ యాప్ సపోర్ట్, క్లాస్ మోడ్, స్ట్రేంజర్ కాల్ ప్రొటెక్షన్, వీడియో చాట్ డిసేబుల్, షట్‌డౌన్ రిస్ట్రిక్షన్, డయల్‌ప్యాడ్ డిసేబుల్ వంటి పేరెంటల్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే రోజువారీ స్టెప్ కౌంటర్, అలారం, కాలిక్యులేటర్, స్టాప్‌వాచ్, బిల్ట్-ఇన్ ఆఫ్‌లైన్ గేమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రత్యేకమైన హెడ్ ఫోన్స్ కూడా..
పిల్లల కోసం రూపొందించిన సైలర్ ప్లే వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌లో సురక్షితమైన ఆడియో అనుభవంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో గరిష్ట శబ్దాన్ని 85 డెసిబెల్స్ వరకు మాత్రమే పరిమితం చేసే ఫీచర్ ఉంది. దీంతో ఎక్కువ శబ్దం వల్ల వినికిడి సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సంగీతం వినడం, లెర్నింగ్ యాప్‌లు, కథలు, వీడియోలు చూడటానికి ఇవి అనుకూలంగా ఉంటాయి. ఈ హెడ్‌ఫోన్స్‌లో 40 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్లు, సర్దుబాటు చేసుకునే హెడ్‌బ్యాండ్, ఇయర్‌కప్స్, మృదువైన ఇయర్‌కుషన్లు, తక్కువ బరువు డిజైన్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. బ్లూటూత్ 5.4 కనెక్టివిటీతో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర బ్లూటూత్ పరికరాలకు కనెక్ట్ చేయవచ్చు. మల్టీఫంక్షన్ బటన్ల ద్వారా పాటలను ప్లే లేదా పాజ్ చేయడం, వాల్యూమ్ మార్చడం, ట్రాక్ మార్చడం, కాల్స్ అటెండ్ చేయడం సులభంగా చేయవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కూడా ఉంది.
ధర ఎంతంటే..
బోట్ సైలర్ నావ్ ధర రూ. 6,499 ఉండగా, ఇది ఫెయిరీ పింక్, స్కై బ్లూ రంగుల్లో లభిస్తోంది. బోట్ సైలర్ ప్లే హెడ్‌ఫోన్స్ ధర రూ. 1,499గా ఉంది. ఇవి బబుల్‌గమ్ పింక్, షార్క్ బ్లూ, కోరల్ బ్లూ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఉత్పత్తులపై ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది. బోట్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
- ●MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి
- ●Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు
- ●Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?
- ●Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..
- ●Kajal Aggarwal | కాజల్‌కు అచ్చిరాని బాలీవుడ్ - చందమామ ఖాతాలో మరో డిజాస్టర్
- ●Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు 11,000 దరఖాస్తులు.. దరఖాస్తు చేసుకోండిలా..

MP Kadiyam Kavya | వరంగల్‌లో పెండింగ్ రహదారులకు ఆమోదం తెలపండి

Rajasthan High Court | విద్యార్థిని టీచర్ మందలించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు : రాజస్థాన్ హైకోర్టు

Dasoju Sravan | నెత్తి మీద నోరు పెట్టుకొని చెప్పినం.. ఇప్పుడేమంటవ్ రేవంత్?

Laurus Labs | భారీ ర్యాలీతో దూసుకెళ్తున్న ఫార్మా స్టాక్.. 5 రోజుల్లో ఏకంగా 10 శాతం లాభాలు..




