Trisha | తెలుగులో త్రిష క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ – డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో చెన్నై క్వీన్
ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌తో చెన్నై క్వీన్ త్రిష త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిష లీడ్ రోల్‌లో నటించిన బృందా వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది. బృందా 2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ సిరీస్ ఆగస్ట్‌లో సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Jul 28, 2026, 4.29 pm IST
Trisha | ఓ వైపు సినిమాలు, మరోవైపు వ్యక్తిగత జీవితం తాలూకు పుకార్లతో తమిళనాట చెన్నై క్వీన్ త్రిష తరచుగా వార్తల్లో నిలుస్తోంది. త్రిష హీరోయిన్‌గా నటించిన గత మూవీ కరుప్పు థియేటర్లలో మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మరోవైపు తమిళనాడు సీఎం దళపతి విజయ్‌తో త్రిష అనుబంధంపై తమిళనాట రకరకాల పుకార్లు షికార్లు చేస్తోన్నాయి. విజయ్, త్రిష ప్రేమలో ఉన్నారని, పెళ్లిచేసుకోబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. ఈ రూమర్లపై కోలీవుడ్ బ్యూటీ ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. అవునని చెప్పకపోవడం, కాదని ఖండించకపోవడం తమిళ సినీ , రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తెలుగు వెబ్‌సిరీస్....
పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు కెరీర్‌పై ఫోకస్ పెడుతోంది త్రి. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తోంది. ఓ వెబ్‌సిరీస్‌తో త్రిష త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్రిష లీడ్ రోల్‌లో రూపొందిన బృందా వెబ్‌సిరీస్ 2024లో సోనీలివ్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో త్రిష అద్భుత నటనతో అదరగొట్టింది. తాజాగా బృందా వెబ్‌సిరీస్‌కు సీజన్ 2 రాబోతుంది.
సోనీ లివ్‌లో...
బృందా 2 పేరు తోరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ఆగస్ట్ నెలలో సోనీలివ్ ఓటీటీలో ఈ తెలుగు వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫస్ట్ సీజన్‌లో అమాయకత్వం, ధైర్యం కలబోసిన పోలీస్‌గా త్రిష కనిపించింది. సెకండ్ సీజన్‌లో డేరింగ్ అండ్ డాషింగా ఆమె పాత్ర సాగుతుందని అంటున్నారు. మాస్ ఎలిమెంట్స్‌తో డిఫరెంట్‌గా త్రిష పాత్రను డైరెక్టర్ డిజైన్ చేసినట్లు సమచారం. బృందా 2లో ఓ టాలీవుడ్ హీరో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్‌సిరీస్‌కు మనోజ్ వంగల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే బృందా 2 రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి విశ్వంభర...
ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభరలో హీరోయిన్‌గా నటిస్తోంది త్రిష. సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనుల కారణంగా చాలా కాలంగా వాయిదాపడుతూ వస్తోంది. ఈ అక్టోబర్‌లో విశ్వంభర థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వంభరలో త్రిషతో పాటు ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా నటించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Dhanush | పాలిటిక్స్‌లోకి తమిళ హీరో ధనుష్? – సీఎం విజయ్‌కి పోటీగా ఎన్నికల బరిలో…
జులై 27, 2026

Jana Nayagan Collection | జననాయగన్ ఫస్ట్ డే కలెక్షన్స్ – దళపతి విజయ్ ఆ రెండు డిజాస్టర్ల కంటే తక్కువే!
జులై 24, 2026

Pooja Hegde | మూడు గంటల సినిమాలో ముప్పై నిమిషాలు కూడా కనిపించలేదు – పూజా హెగ్డేకు మరోసారి అన్యాయం
జులై 23, 2026
తాజావార్తలు
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..
- ●Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
- ●CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..
- ●Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్
- ●TAUK | లండన్ వీధుల్లో బోనాల జాతర.. ప్రత్యేక ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు
- ●BJP Ramchandar Rao | రాష్ట్రమంతా బీజేపీ శరవేగంగా విస్తరిస్తోంది.. నెక్స్ట్ అధికారం మాదే

Stock Markets | స్టాక్ మార్కెట్లకు మళ్లీ బ్రేక్.. సెన్సెక్స్, నిఫ్టీలలో స్వల్ప నష్టాలు..

Road Accident in USA | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి

CM Revanth Reddy | తెలంగాణకు 11.56 లక్షల ఇండ్లు కేటాయించండి..

Jitendra Singh | యూపీఏ హయాంలోనే పేపర్ లీక్‌లు.. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదు..? : జితేంద్ర సింగ్



