త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy | అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు తెలంగాణను అనుకూల వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు, పరిశోధన, ఆవిష్కరణలకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

P

Telangana | Published On Jul 28, 2026, 8.50 pm IST

CM Revanth Reddy | సాంకేతిక పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం : సీఎం రేవంత్‌రెడ్డి
Advertisement
  • స్కైరూట్ ఏరోస్పేస్ ప్రతినిధులకు అభినందనలు

CM Revanth Reddy | అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటుకు తెలంగాణను అనుకూల వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు, పరిశోధన, ఆవిష్కరణలకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్‌కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, సీఓఓ నాగభరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి ప్రైవేటు రంగ ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగ వివరాలను సీఎంకు వివరించారు.

ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన దేశాల్లో అమెరికా, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచిందని వారు తెలిపారు. ఈ విజయం దేశ అంతరిక్ష రంగానికి కొత్త అవకాశాలను తెరిచిందని వివరించారు. సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాలపై చర్చ జరిగింది. అధునాతన తయారీ, పరిశోధన–అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), ఆవిష్కరణలు, ప్రభుత్వ–ప్రైవేటు అంతరిక్ష సంస్థల మధ్య సహకార అవకాశాలపై ముఖ్యమంత్రితో స్కైరూట్ ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. వారు సాధించిన విజయం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుందని ప్రశంసించారు. తెలంగాణలో సాంకేతిక ఆధారిత పరిశ్రమలకు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Advertisement
Advertisement