TG Speaker | శాసనసభ కమిటీలు నిష్పక్షపాతంగా పనిచేయాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
TG Speaker | పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీల పాత్ర అత్యంత కీలకమని, రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు కమిటీ (అష్యూరెన్సెస్), నియమాల కమిటీ (రూల్స్), నైతిక విలువల కమిటీ (ఎథిక్స్) తొలి సమావేశాలు నిర్వహించారు.
TG Speaker | పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీల పాత్ర అత్యంత కీలకమని, రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా పనిచేస్తూ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో మంగళవారం శాసనసభ ప్రభుత్వ హామీల అమలు కమిటీ (అష్యూరెన్సెస్), నియమాల కమిటీ (రూల్స్), నైతిక విలువల కమిటీ (ఎథిక్స్) తొలి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు.
ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, సభ్యులు జె. అనిరుధ్‌రెడ్డి, జారే ఆదినారాయణ పాల్గొన్నారు. స్పీకర్ అధ్యక్షతన జరిగిన రూల్స్ కమిటీ సమావేశానికి సభ్యులు దానం నాగేందర్, తూడి మేఘారెడ్డి, భూక్యా మురళీనాయక్ హాజరయ్యారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యుడు జి. మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. కౌన్సిల్ కార్యదర్శి డాక్టర్ వి. నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి కూడా సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ పటోళ్ల సంజీవరెడ్డి, ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును పర్యవేక్షించే బాధ్యత హామీల కమిటీపై ఉంటుందని, ఆ దిశగా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
శాసనసభ సక్రమంగా, సమర్థవంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడంలో రూల్స్ కమిటీ పాత్ర కీలకమని స్పీకర్ పేర్కొన్నారు. శాసనసభ పనితీరు కేవలం చట్టాల ద్వారానే కాకుండా, వాటిని రూపొందించే ప్రజాప్రతినిధుల ప్రవర్తన, నిబద్ధత, వ్యవహారశైలిని బట్టి కూడా అంచనా వేయబడుతుందని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ప్రపంచవ్యాప్తంగా పార్లమెంటరీ వ్యవస్థల్లో నైతిక విలువల కమిటీలు ఏర్పాటయ్యాయని స్పీకర్ పేర్కొన్నారు. అన్ని కమిటీలు నిష్పక్షపాత ధోరణితో విధులు నిర్వహించాలని సూచించారు.
శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కమిటీల చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ సభ్యులకు ముందుగా అందజేసేది రూల్స్ బుక్‌నేనని, దాని ఆధారంగానే స్పీకర్ సభను నిర్వహిస్తారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రూల్స్ బుక్‌లో మార్పులు జరిగాయని, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కమిటీ సభ్యులంతా కలిసి సమగ్ర నిబంధనలతో కొత్త రూల్స్ బుక్‌ను రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల శాసనసభలను అధ్యయనం చేసి అక్కడ అమలవుతున్న విధానాలను పరిశీలించాలని, అవసరమైన సూచనలు స్వీకరించాలని కమిటీలకు మంత్రి సూచించారు. సభలో నియమ నిబంధనల అమలుతో పాటు శాసనసభ హుందాతనాన్ని కాపాడటంలో ఎథిక్స్ కమిటీ కీలక పాత్ర పోషించాలని, కమిటీ నిర్ణయాలు పారదర్శకంగా ఉండి తెలంగాణకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. కమిటీల చైర్మన్లు మాట్లాడుతూ శాసనసభ తమపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా బాధ్యతాయుతంగా పనిచేస్తూ సభ గౌరవాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
జులై 28, 2026

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
జులై 28, 2026

Minor Girls Rescued | మైనర్ బాలికలు దొరికారు..! సాంకేతికతతో జాడ కనిపెట్టిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు
జులై 28, 2026
తాజావార్తలు
- ●IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్
- ●Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు
- ●Dulquer Salmaan | వెరైటీ లవ్ సాంగ్‌తో దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ - హీరోయిన్గా అమెరికా అమ్మాయి
- ●Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ
- ●KTR Meets Ashwini Vaishnav | కాజీపేట రైల్వే డివిజన్‌ను ఏర్పాటు చేయండి.. కేంద్రమంత్రిని కోరిన కేటీఆర్
- ●Heavy Rains | హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై బారులు తీరిన వాహనాలు

IND Vs SL | శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు ప్రకటన.. తొలిసారి జట్టులోకి సారాంశ్ జైన్

Allu Arjun | బన్నీ ఫ్యాన్స్ మీట్ వెనకున్న కారణమిదే - ఐకాన్ స్టార్‌పై నెటిజన్ల ప్రశంసలు

Dulquer Salmaan | వెరైటీ లవ్ సాంగ్‌తో దుల్కర్ సల్మాన్ సర్ప్రైజ్ - హీరోయిన్గా అమెరికా అమ్మాయి

Specialist Doctor Posts | స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్..! అభినందనలు తెలిపిన మంత్రి రాజనర్సింహ



