Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
Anti Paper Leak Bill | పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు అన్ని రాజకీయ పార్టీలూ అంగీకరించాయి. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) ప్రకటించారు. ఈ బిల్లుపై రేపు సభలో విస్తృత చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
Anti Paper Leak Bill | దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను, నిరుద్యోగ యువతను వేధిస్తున్న పేపర్ లీకేజీల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై (Anti Paper Leak Bill) రేపు లోక్‌సభలో విస్తృతంగా చర్చ జరగనుంది. స్పీకర్ ఓం బిర్లా (Om Birla) చొరవతో ఈ బిల్లుపై చర్చకు ప్రధాన రాజకీయ పార్టీలు అంగీకరించాయి. ఈ విషయాన్ని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026పై పార్లమెంట్‌లో తీవ్ర దుమారం రేగుతోంది. విపక్షాల నిరసనల మధ్యే ఈ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) ఈ బిల్లును దిగువ సభ ముందుకు తీసుకెళ్లారు. పబ్లిక్ పరీక్షల్లో చోటుచేసుకునే అక్రమాలను నిరోధించేందుకు ఈ బిల్లును రూపొందించినట్లు మంత్రి స్పీకర్ కు వివరించారు. ఈ బిల్లుపై చర్చలో సభ్యులంతా పాల్గొనాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అయితే, జులై 20న విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో దిగువ సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభమైనా కూడా విపక్ష కూటమి ఎంపీలు తమ నిరసనలను కొనసాగించారు. దీంతో సభ మళ్లీ వాయిదా పడింది.
స్పీకర్ చొరవ..
ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా అధికార, విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడారు. ఈ బిల్లు కోట్లాది మంది విద్యార్థులు, యువత, పోటీ పరీక్షల పారదర్శకతకు సంబంధించిన అంశమని చెప్పారు. దీనిపై సమగ్ర చర్చ అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుపై ఆరోగ్యకరమైన చర్చ జరిగేందుకు సహకరించాలని కోరారు. యువత భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంపై చర్చకు రాజకీయాలను పక్కనపెట్టి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్ విజ్ఞప్తి మేరకు ఈ బిల్లుపై చర్చకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అంగీకరించాయి. దీంతో రేపు ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. చర్చ సందర్భంగా ఈ బిల్లులో ప్రతిపక్షాలు సవరణలు సూచించే అవకాశం ఉంది. ఆ తర్వాత బిల్లుపై ప్రభుత్వ స్పందన అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు.
Also Read..
మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..
రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్
సంబంధిత వార్తలు

MP Chamala Kirankumar Reddy | 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి.. ఎంపీ చామల డిమాండ్
జులై 27, 2026

Dharmendra Pradhan | రాజీనామా తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు వెళ్లిన ధర్మేంద్ర ప్రధాన్.. ఎంపీలు ఏం చేశారంటే..?
జులై 27, 2026

Anti Paper Leak Bill | లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు.. విపక్ష ఎంపీల ఆందోళన
జులై 27, 2026
తాజావార్తలు
- ●Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
- ●Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..
- ●IndiGo flight | విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్
- ●Manipal Health IPO | ఈ వారంలోనే మణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాలకు చాన్స్..
- ●Bakka Judson | కొండా సురేఖ రేవంత్‌నే కేర్ చేయద్.. ఇగ కడియం ఎంత
- ●AK-47 rifles | AK-47 వినియోగంపై అమిత్ షా ప్రకటన చేసే వరకు సభను జరగనివ్వం: కాంగ్రెస్

Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..

Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

IndiGo flight | విమానం గాల్లో ఉండగా పొగలు.. ప్రయాణికుల్లో టెన్షన్.. టెన్షన్

Manipal Health IPO | ఈ వారంలోనే మణిపాల్ హెల్త్ ఐపీవో.. 4 శాతం లాభాలకు చాన్స్..



