త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gig Workers’ Rally | గిగ్ వ‌ర్క‌ర్ల ర్యాలీ.. మ‌హిళా స్కూటీపై రాహుల్ ప్ర‌యాణం

Gig Workers' Rally | భార‌త్ స‌మ్మిట్ కోసం శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌ (Hyderabad)కు చేరుకున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) శ‌నివారం ఉద‌యం గిగ్ వ‌ర్క‌ర్ల ర్యాలీ (Gig Workers' Rally)లో పాల్గొన్నారు.

S

Flash news | Published On Nov 14, 2026, 1.30 pm IST

Gig Workers’ Rally | గిగ్ వ‌ర్క‌ర్ల ర్యాలీ.. మ‌హిళా స్కూటీపై రాహుల్ ప్ర‌యాణం
Advertisement

Gig Workers' Rally | త్రినేత్ర న్యూస్: భార‌త్ స‌మ్మిట్ కోసం శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌ (Hyderabad)కు చేరుకున్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) శ‌నివారం ఉద‌యం గిగ్ వ‌ర్క‌ర్ల ర్యాలీ (Gig Workers' Rally)లో పాల్గొన్నారు. శిల్పకళా వేదిక నుంచి ప్రారంభ‌మైన ర్యాలీలో ఓ మ‌హిళా గిగ్ వ‌ర్క‌ర్ స్కూటీపై ప్ర‌యాణించి ప‌లువురి దృష్టిని ఆక‌ర్షించారు. శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో పాల్గొని గిగ్ వ‌ర్క‌ర్ల‌లో ఫుల్‌ జోష్ నింపారు.

రాహుల్‌తో పాటు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఈ ర్యాలీకి హాజ‌ర‌య్యారు. గిగ్ వర్కర్లు భారీ ఎత్తున త‌ర‌లిరావ‌డంతో దారంతా జ‌న‌సందోహం నెల‌కొంది. పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించి ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Advertisement
Advertisement